మీ ఇంట్లో పూజ కోసం పక్కింట్లో పూలు కోస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే.. అలా ఎప్పటికీ చెయ్యరు..!

మీ ఇంట్లో పూజ కోసం పక్కింట్లో పూలు కోస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే.. అలా ఎప్పటికీ చెయ్యరు..!

by Anudeep

Ads

ఏ దేవుడి పూజకి అయినా పూలు మాత్రం తప్పనిసరి. మనకు ఇష్టమైన దైవానికి బోలెడు రకాల పువ్వులతో అలంకరించి పూజ చేసుకుంటే వచ్చే మానసిక తృప్తి వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. ఏ దేవుడు కూడా తనకు అన్నేసి పువ్వులు పెట్టమని కోరలేదు. మన శక్తికొలది ఏది సమర్పించినా తీసుకుంటాను అని చెప్పాడు. కానీ మనమేమో ఏదేదో హైరానా పడుతూ ఉంటాం.

Video Advertisement

pooja 1

పూలు పెట్టె విషయం లో కూడా అంతే.. ఇంట్లో పూల చెట్లు ఉన్నవారు, బయట పూలు కొనుక్కొచ్చి పెట్టేవారి సంగతి పక్కన పెడితే… కొంతమంది పక్కింట్లోంచి కూడా పూలు కోసుకొచ్చి పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేయచ్చా..? అని ఎవరు ఆలోచించారు. దీనిపై శాస్త్రాలు ఏమంటున్నాయి ఇప్పుడు చూద్దాం. పక్కింట్లో అయినా, మనింట్లో అయినా ఏ చెట్టు నుంచి అయినా అన్ని పూలు కోయకూడదట. ఒక్క పువ్వు కూడా లేకుండా చెట్టుని బోసి గా ఉంచకూడదు.

pooja 3

దేవుడి కోసం కొన్ని పూవులు మాత్రం కోసుకుని.. మరికొన్ని పూలని వదిలేయాలట. అలాగే కొంతమంది వేరే వాళ్ళ ఇంట్లో చెట్టు నుంచి పూలు కోసేటప్పడు అడిగి కోసుకుంటారు. వీళ్ళు కొంచం నయం. మరికొందరైతే.. అసలు చెప్పకుండా కోసుకుంటారు. ఇది దొంగతనం కిందే వస్తుందట. పూలు దొంగతనం చేసి దేవుడికి పెట్టి పూజ చేయడం చాలా తప్పు. దీని వల్ల పుణ్యం సంగతేమో కానీ.. పాపం మూటగట్టుకుంటారట.

pooja 2

ఈ విషయాన్నీ వివరించడం కోసం ఓ శ్లోకం కూడా చెప్పబడింది.
తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||

అంటే అర్ధం ఏమిటంటే.. పూలు, పండ్లు, తాంబూలం వంటివాటిని దొంగతనం చేసి దేవుడికి సమర్పించే వారు మరుసటి జన్మ లో కోతి గా పుడతారట. గడ్డి, చెప్పులు, ప్రత్తి దొంగతనం చేసిన వారు మేకలా పుడతారట. పూజలు చేస్తే పుణ్యం రావాలి కానీ.. ఇలా పాపం మూటగట్టుకోవద్దు. ఒకసారి ఆలోచించుకోండి.


End of Article

You may also like