Ads
పాము ఈ పేరు వినగానే అమాంతం ఒక్కసారిగా పారిపోతాము. పాము అనే పేరు వినగానే ఒళ్లంతా జలదరించినట్లు అవుతుంది. ఒక్కసారి ఇంటిలో ప్రవేశించిందంటే, అది వెళ్లే వరకు మనకు నిద్ర పట్టదు. పాములపై ఎన్నో కథలు వింటుంటాం. ఇప్పటికీ మన హిందూ ధర్మం లో పాములను దేవతగా కొలుస్తారు. పాము పగ పడుతుందని, పగ పడితే కాటువేసి చెందుతుందని ఎన్నో మూఢ నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. పాము కంటిపై మన మీద పడితే మనల్ని వెంటాడి చంపుతుంది అని ప్రచారం ఇప్పటికీ ఉంది.
Video Advertisement
ఇప్పటికీ మన హిందూ ధర్మం లో వివాహం త్వరగా కానివారు, సంతానం కలగని వారు పాములను పూజిస్తూ ఉంటారు. పాములు కథాంశంగా వచ్చిన సినిమాలు కూడా మన తెలుగులో విజయం సాధించాయి. పాముల గురించి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. పాములకు చెవులు ఉన్నాయా? పాము పగ పడుతుందా? పాము ఏ విధంగా తన మూత్రవిసర్జన చేయదు? అనే డౌట్స్ చాలా వరకు ఉన్నాయి.
ఇంతకీ అసలు విషయానికి వస్తే ఇతర జీవులతో పోలిస్తే పాములు మూత్రవిసర్జన చెయ్యవు అనే విషయం చెప్పవచ్చును. అంటే వాటి శరీరానికి చాలా తక్కువ నీరు అవసరమవుతుంది. మన మనుషుల్లాగా పాములకు చెమట పట్టదు. ఇతర జంతువుల అవి నీరు త్రాగవు. పాములు వేటాడి పట్టుకున్నా జీవులను ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ జీవి శరీరంలోని నీటితో సరిపెట్టుకుంటాడాయి. అందుకే పాములు మూత్రవిసర్జన చెయ్యవు అనే విషయం తేలిపోయింది.
End of Article