రామ్ పోతినేని “ది వారియర్” ట్రైలర్‌లో ఇది గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

రామ్ పోతినేని “ది వారియర్” ట్రైలర్‌లో ఇది గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

by Anudeep

Ads

ఎనర్జీటిక్ హీరో రామ్, కృతి శెట్టి కలిసి నటిస్తున్న చిత్రం ది వారియర్. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రం ఈ జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లింగుస్వామి ది వారియర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి గాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మాణ సారధ్యం వహించింది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో రెండింటిలోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Video Advertisement

దేవిశ్రీ ప్రసాద్ ఈ వారియర్ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ బుల్లెట్ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఉర్రూతలూగించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా, జయప్రకాష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

Also Read: మెగాస్టార్ “చిరంజీవి” హీరోగా నటిస్తున్న… “గాడ్ ఫాదర్” ఫస్ట్‌లుక్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

did you notice this in the warriorr movie trailer

screengrab from : The Warriorr trailer / YouTube

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఎంతో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇందులో రామ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు అని అర్థం అవుతోంది. రామ్ తల్లి పాత్రలో నదియా నటిస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలవుతోంది. తమిళ్ లో కూడా రామ్ తన డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. అలాగే ఆది పినిశెట్టి కూడా తెలుగు తమిళంలో తన డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రామ్ మొదటి తమిళ్ సినిమా. కాని దర్శకుడు చేసిన ఒక చిన్న తప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదేంటి ఇలా చేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ఈ 3 రాజమౌళి సినిమాల్లో కామన్ గా ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

did you notice this in the warriorr movie trailer

screengrab from : The Warriorr trailer / YouTube

ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  దర్శకుడు తెలియక చేస్తారో.. తెలిసి చేస్తారో గాని.. మన ప్రేక్షకులు గమనించలేరు అనుకుంటూ ఉంటారేమో , మన ప్రేక్షకులు వాళ్లకు మించిన దేశముదుర్లు అనే విషయం వాళ్లకు తెలియదు. తమిళంలో విడుదల చేసిన ది వారియర్  టైలర్ లో చిన్న తప్పు చేశాడు దర్శకుడు. అదే మధురైలో కొండారెడ్డి బురుజు చూపించడం. ఇది సైతం మన నెటిజన్ల కంట్లో పడి, మధురైలోకి కొండారెడ్డి బురుజు ఎలా వచ్చిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : విజయ్ దేవరకొండ “లైగర్” కొత్త పోస్టర్ వెనుక… ఇంత పెద్ద కథ ఉందా..? ఈ పోస్టర్ అర్థం ఏంటంటే..?


End of Article

You may also like