ఈ కింది చిత్రం లో ఇది గమనించారా? అంటే.. వేల సంవత్సరాల క్రితమే..?

ఈ కింది చిత్రం లో ఇది గమనించారా? అంటే.. వేల సంవత్సరాల క్రితమే..?

by Anudeep

Ads

భారత్ సనాతన సంప్రదాయాలకు, సంస్కృతికి, రకరకాల కళలకు ప్రసిద్ధి. భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన కళలలో శిల్ప కూడా ఒకటి. భారత దేశంలోని హిందూ దేవాలయాల్లో కనిపించే శిల్పాలు, వాటి అందం ప్రపంచంలో మరెక్కడా కానరాదు. దేవాలయాల బయట కనిపించే శిల్పాలు ప్రాణం ఒక్కటే తక్కువ అన్నట్లు ఉంటాయి. ఆ బొమ్మలకి కన్నులు, చెవులు, చేతులు, కళ్ళు ఇలా అన్ని అవయవాలు అచ్చంగా మనుషులకు ఉన్నట్లే ఉంటాయి.

Video Advertisement

బండరాళ్లను చెక్కి శిల్పులు ఇలాంటి శిల్పాలను రూపొందిస్తుంటారు. వారి ప్రాణం పెట్టి ఈ బొమ్మలకి లేని ప్రాణాన్ని పోస్తుంటారు. చూడడానికి ఎంతో అందంగా, ఆహ్లాదంగా కనిపించే ఈ శిల్ప కళ భారత దేశానికే సొంతం. పూర్వం కాలంలో ఇప్పటిలా పుస్తకాలూ, పెన్ను, పేపర్లు లేని కాలంలో అప్పటి చరిత్రని తెలియ చెప్పడానికి ఈ శిల్ప కళ ఎంతగానో దోహదపడింది.

shilpam 2

అప్పటి కాలం నాటి వస్తువుల వాడకం, అప్పటి ప్రజల అలవాట్లు, కట్టు బొట్లు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఈ పురాతన శిల్పాలలో గోచరిస్తూ ఉంటాయి. వీటిని చూసి మన పూర్వ ప్రజలు ఎలా నివసించారో మనం తెలుసుకోగలుగుతున్నాము. అప్పటి రాజులు ఎక్కువగా కట్టడాలను, దేవాలయాలను నిర్మిస్తూ ఉండేవారు. అయితే.. ఈ భవనాలలో అప్పటి కాలం నాటి విశేషాలను, ఆచార వ్యవహారాలను తెలిపేలా శిల్పాలను చెక్కించేవారు. భారతదేశంలోని చాలా పురాతన దేవాలయాలలో, భవనాలలో చెక్కబడ్డ ఈ శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.

shilpam 1

ఈ పైన ఇవ్వబడిన ఫోటోలను మీరు జాగ్రత్తగా గమనించి చూడండి. మొదటి ఫొటోలో ఓ అమ్మాయి తన పుస్తకంలో ఏదో రాసుకుంటూ ఉన్నట్లు కనిపిస్తోంది కదా. ఈ శిల్పం ఖజురాహోకు చెందినది. దీనికి కనీసం వేయి సంవత్సరాల వయసు ఉంటుంది. అంటే వెయ్యేళ్ళ క్రితమే భారత్ లో స్త్రీ సాధికారత, ఆడవారికి కూడా విద్య అవసరం అన్న విషయాలను బలంగా నమ్మేవారు. మరో చిత్రాన్ని గమనించి చూస్తే.. ఈ శిల్పంలో ఓ మహిళ కనుబొమ్మలు దిద్దుకుంటూ కనిపిస్తోంది. మరో శిల్పంలోని మహిళ పర్సు ను పట్టుకుని నుంచుంది. అంటే.. వేల సంవత్సరాల క్రితమే భారత్ లో ఫ్యాషన్ పుట్టింది. ఇప్పుడు మనం ఇతర దేశాలను అనుకరిస్తున్నాం కానీ.. ఒకప్పుడు భారత దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు అనుకరణ చేసేవి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా..?


End of Article

You may also like