Ads
మనం రోజు చూస్తూనే ఉన్నా కొన్ని విషయాలను అంతగా పట్టించుకోము. అలాంటివాటిలో ఇది కూడా ఒకటి. ఇప్పుడంటే ట్రైన్ ఎక్కడానికి ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం కానీ, ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం రాకముందు వరకూ రైల్వే స్టేషన్ కు వెళ్లి టికెట్స్ ను తీసుకోవాల్సి వచ్చేది.
Video Advertisement
అయితే..మనం చేరాల్సిన స్టేషన్ కు టికెట్ అడిగి డబ్బులు కట్టిన తరువాత మనకు ఓ టికెట్ ఇస్తారు. చాలా మంది ఆ టికెట్ పై స్టేషన్ పేరు, డేట్, సీట్ నెంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వదిలేస్తారు.
ట్రైన్ దిగగానే.. ఆ టికెట్ ను నలిపేసి పక్కన పడేస్తారు. అంతే తప్ప దానిపైన ఏమి రాసి ఉందొ కూడా ఎవరూ గమనించారు. అయితే.. ఈసారి గమనించి చూడండి. టికెట్ పై ఓ ఐదు అంకెలు ఉంటాయి. ఈ ఐదు అంకెల వెనక అర్ధం ఏంటో తెలుసా..? ఈ నెంబర్ ప్రయాణీకుడు ఎక్కడ నుంచి ఎక్కడకి వస్తున్నాడు అనే విషయాన్నీ తెలియ చేస్తుంది. ఈ నెంబర్ వెనుక అర్ధం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మొదటి అంకె ఒకటి లేదా రెండు ఉంటె.. ఆ ట్రైన్ చాలా దూరం ప్రయాణిస్తుంది అని అర్ధం. శతాబ్ది, రాజధాని, జన్ సాధర్, గరీబ్ రథ్, సంపర్క్ క్రాంతి, దురంతో వంటి రైళ్లకు ఈ ఒకటి లేదా రెండు అంకెతో ప్రారంభం అవుతుంది. అదే మొదటి అంకె మూడు తో స్టార్ట్ అయితే అది కోల్ కతా సబ్ అర్బన్ రైలు అని అర్ధం. అదే నాలుగుతో మొదలైతే చెన్నై, సికింద్రాబాద్, న్యూ ఢిల్లీ లాంటి ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైలు అని అర్ధం. అదే మొదటి అంకె ఐదు అయితే అది పాసెంజర్ రైలు అని, ఆరు అయితే అది MEMU (Mainline Electric Multiple Unit) ట్రైన్ అనీ అర్ధం. ఇక ఏడుతో మొదలైతే అది DEMU ( Diesel Electric Multiple Unit) ట్రైన్ అని అర్ధం.
End of Article