ఇన్నాళ్లు స్టార్ క్రికెటర్ భార్యలు అంటే మైదానంలోకి వచ్చి చప్పట్లు మాత్రమే కొట్టేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. భర్తలకు ఏమాత్రం తీసిపోకుండా వారి సతీమణులు బ్యాట్ చేత పట్టి ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తున్నారు. తాజాగా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాభా జడేజా అలానే అలరించారు.

Video Advertisement

క్రికెటర్ల భార్యలు గ్యాలరీల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. గ్రౌండ్‌లో భర్త మ్యాచ్‌లు ఆడుతుంటే చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తుంటారు. ఇక స్టువర్ట్ బిన్నీ, బుమ్రా భార్యలైతే కామెంటేటర్లుగా మైదానంలో సందడి చేస్తుంటారు. అంతే కానీ బ్యాట్‌ పట్టి గ్రౌండ్‌లోకి దిగడం చాలా అరుదు. తాజాగా రివాబా జడేజా తన ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకున్నారు.

see jageja wife done better with bat..!!

రవీంద్ర జడేజా భార్య రివాబా బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచిన విషయం తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జడేజా జామ్‌నగర్ నియోజకవర్గానికి పోటీ చేసి గెలుపొందారు. రివాబాకు మద్దతుగా రవీంద్ర జడేజా సైతం ప్రచారం చేశారు. ఇక తాజాగా జరిగిన గుజరాత్ ఎమ్మెల్యే ప్రీమియర్ లీగ్ లో రివాబా బ్యాట్ చేత పట్టి బౌండరీల వర్షం కురిపించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

see jageja wife done better with bat..!!

రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అయిన రివాభా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. పలు బంతులను బౌండరీకి తరలించింది. అంతేకాదు ఆమె ఫీల్డింగ్‌లోనూ ఔరా అనిపించింది. బంతి బౌండరీకి వెళ్లకుండా బాగానే ఫీల్డింగ్ చేసింది. ఆమె బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆమెపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘జడేజాకు ఏమాత్రం తీసిపోరు..’ అంటూ ఆమెను పొగుడుతున్నారు.

see jageja wife done better with bat..!!

ఇక రవీంద్ర జడేజా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో అంచనాలకు మించి రాణిస్తోంది. గతేడాది పేలవ ఆటతీరుతో నిరాశపరిచినా.. ఈ సీజన్ లో ఆటగాళ్లందరూ అత్యుత్తమ ఆట తీరు కనబరుస్తున్నారు. ఇప్పటివరకు సీఎస్‪కే 7 మ్యాచులు ఆడగా, ఐదింట విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది.