ముక్కు లో ఉండే హెయిర్ ని తొలగిస్తున్నారా..? ఈ విషయాలు తెలిస్తే.. ఇంకెప్పుడూ ఇలా చెయ్యరు..!

ముక్కు లో ఉండే హెయిర్ ని తొలగిస్తున్నారా..? ఈ విషయాలు తెలిస్తే.. ఇంకెప్పుడూ ఇలా చెయ్యరు..!

by Anudeep

చాలా మంది శరీరం పై కనిపించే అవాంఛిత రోమాలను పూర్తి స్థాయి లో తొలగిస్తూ ఉంటారు. వీరు తమ ముక్కు లోపల కూడా వెంట్రుకలు ఉండడానికి ఇష్టపడరు. అలా ఉంటే అపరిశుభ్రం గా ఉన్నామని భావిస్తూ ఉంటారు. అలా వెంట్రుకలు ఉంటే తాము అందవిహీనం గా ఉన్నామని భావిస్తూ ఉంటారు. కానీ.. ఇలా వెంట్రుకలు తీయడం వలన ప్రాణాల మీదకు వస్తుందని మీకు తెలుసా..?

Video Advertisement

nose hair 1

వాస్తవానికి ముక్కులో ఉండే వెంట్రుకలు మన చుట్టూ వాతావరణం లో ఉండే దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మ జీవులను మన శరీరం లోపలకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఎప్పుడైతే.. ఇవి అందానికి అడ్డు వస్తున్నాయని పీకేస్తామో అప్పుడు మన శరీరం లోకి బాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్ ను కలుగచేస్తూ ఉంటాయి. కొంతమంది కి ముక్కు రంధ్రాల వద్ద మొటిమలు లాంటివి వస్తూ ఉంటాయి. దానికి కూడా ఇన్ఫెక్షన్ రావడమే కారణం.

 

ముక్కులో ఉండే ఈ వెంట్రుకలు తేమను ఏర్పరుస్తాయి. ఈ తేమతో ఓ ఉచ్చు లా ఏర్పాటు చేసి బాక్టీరియా ను రాకుండా అడ్డుకుంటాయి. ఈ బాక్టీరియా లోపల పేరుకున్నప్పుడు మనకు తుమ్ము వచ్చి.. తద్వారా ఈ బాక్టీరియా లోపలకు వెళ్లకుండా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే.. ఈ వెంట్రుకలను తీసేస్తామో.. అప్పుడు బాక్టీరియా కు లోపలకి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది.

ఐతే నాసికా రంధ్రాల వద్ద వెంట్రుకలు ఉంటే.. ముక్కు లోపలి భాగాలలో ఇన్ఫెక్షన్ ఏర్పడకుండా ఉంటుంది. ఈ వెంట్రుకలని కత్తిరించడం లేదా వ్యాక్సింగ్ చేయడం వలన బాక్టీరియా లోపలకి ప్రవేశించడానికి మార్గం ఏర్పడుతుంది. అవి సులభం గా ఊపిరితిత్తులకు చేరిపోతాయి. అప్పుడు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. క్లీన్ గా ఉండాలి అని భావించి కొత్త ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవద్దు.


You may also like