ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచంలోనే ఫేమస్‌ ప్రధానులలో ఒకరు. మోదీ కి ప్రస్తుతం 72 ఏళ్ళు. ఈ ఏజ్‌లో కూడా మన పీఎం రోజుకు 18 గంటలు పనిచేస్తారు. రోజు మొత్తం బిజీగా ఉన్నా యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉంటారు. ఎన్ని మీటింగ్‌లు అటెండ్‌ అయినా, ఎంత సేపు ప్రసంగించినా.. ఎప్పుడూ నీరసంగా అనిపించరు. ఆయన ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఆయన జీవన శైలి. ప్రతి రోజూ ఆయన తెల్లవారు జామునే నిద్రలేస్తారు. తప్పకుండా యోగా, సూర్యనమస్కారాలు, ధ్యానం చేస్తారు.

Video Advertisement

అలాగే మోదీ ఆహారం విషయం లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉదయం లేచిన తర్వాత షుగర్ ఫ్రీ టీ ని తాగుతారు. ఆ తర్వాత ప్రోటీన్స్ ని అందించే టిఫిన్ ని తింటారు. అందులో పోహా, ఢోక్లా వంటివి తింటారు. అలాగే మధ్యాహ్న భోజనానికి గుజరాతి వంటకాలను తినేందుకు ఇష్టపడతారు. చపాతీ ని తినేందుకు మక్కువ చూపుతారు. అలాగే అన్నిటికంటే ఎక్కువగా కిచిడి ని తినేందుకు ఇష్టపడతారు. అదే విధంగా ఆయన తన ఆహారం, ఆకలిని సమతుల్యం చేసుకోవడానికి ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తింటారు.

what prime minister modi eats in a day..!!

అలాగే రాత్రి భోజనాన్ని లైట్ గా తీసుకొని ఆవు పాలు తాగుతారు. దసరా నవరాత్రుల్లో మోదీ ఉపవాసం ఉంటారు. ఆ తొమ్మిది రోజులు ఆయన కేవలం ఏదైనా ఒక ఫ్రూట్.. నిమ్మరసం.. టీ తాగి ఉంటారు. అలాగే వారానికి ఒకటి, రెండుసార్లు మునగాకు పరాటా తింటారు. వరం లో మూడు సార్లు గుజరాతీ స్టైల్‌లో చేసిన వాఘరేలీ కిచిడీ తింటారు. ఇవే కాకుండా అప్పుడప్పుడు హిమాచల్‌లో పండే పర్వత పుట్టగొడుగులను తింటారు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలను ఉన్నాయి. దీనిని మోరెల్ మష్రూమ్ అంటారు.

what prime minister modi eats in a day..!!

మోదీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి చాలా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. అలాగే మోదీ కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. యోగా, ఉపవాసం వంటి విషయాలను తరచూ సాధన చేస్తూ ఉంటారు. అలాగే ప్రధాని మోదీ చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటారట. ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి వెళ్లరట. అందుకే ఏడు పదుల వయసులో అడుగు పెడుతున్నప్పటికీ తాను ఇంకా యాక్టివ్ గా ఉన్నానని ఆయన చెబుతారు.