FRONT LOAD vs TOP LOAD: రెండిట్లో ఏ “వాషింగ్ మెషిన్” కొంటే బెటర్.? రెండిట్లో తేడాలు ఏంటంటే.?

FRONT LOAD vs TOP LOAD: రెండిట్లో ఏ “వాషింగ్ మెషిన్” కొంటే బెటర్.? రెండిట్లో తేడాలు ఏంటంటే.?

by Anudeep

ప్రస్తుత కాలం లో వాషింగ్ మెషిన్ లు కూడా నిత్యావసరం అయిపోయాయి. అయితే సాధారణంగా మనం వాషింగ్ మెషీన్‌ని కొనుగోలు చేసేటప్పుడు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయాలా ? లేదా టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయాలా ?
వాటి పని తీరు, నిర్వహణ వంటి అంశాల ద్వారా ఏది మంచిదో నిర్ణయిస్తాం. ముందుగా రెండింటి మధ్య తేడాలేంటో చూద్దాం..

Video Advertisement

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల కంటే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు వాడడానికి ఈజీగా ఉంటాయి. ఎందుకంటే, ఫ్రంట్ లోడ్ లో బట్టలు వేయడానికీ, తీయడానికీ వంగాల్సి ఉంటుంది. పెద్దవారికీ, జాయింట్ ప్రాబ్లంస్ ఉన్నవారికీ ఫ్రంట్ లోడ్ అంత కన్వీనియెంట్ గా ఉండదు. కానీ, ఫ్రంట్ లోడ్ ని కొంచెం ఎత్తులో పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు.

know which washing machine is best front load or top load..!!
అలాగే, టాప్ లోడ్ లో ఉన్న ఇంకొక సౌకర్యం వాష్ సైకిల్ స్టార్ట్ చేశాక కూడా, మధ్యలో పాజ్ చేసి మర్చిపోయినవి ఏమైనా ఉంటే ఉతకడానికి వేయవచ్చు. ఈ ఫెసిలిటీ ఫ్రంట్ లోడ్ లో ఉండదు.
టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ వాడేవారికి బావుంటుంది కానీ, బట్టల విషయం లో కొంచెం రఫ్ గానే ప్రవర్తిస్తాయి. ఓవర్ లోడ్ అయినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ క్లోత్స్ మీద జెంటిల్ గా ఉంటాయి.

know which washing machine is best front load or top load..!!
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లని డ్రయ్యర్ తో సహా ఉపయోగించవచ్చు. వీటిని ఒక దానిమీద ఒకటి పెట్టడం కుదురుతుంది కాబట్టి తక్కువ స్పేస్ తీసుకుంటాయి. అదే టాప్ లోడ్ మీద డ్రయ్యర్ పెట్టడం కుదరదు కాబట్టి పక్క పక్కన పెట్టాల్సి ఉంటుంది. డ్రయ్యర్ అవసరం లేకపోతే ఈ విషయం లో రెండూ ఒకటే. అలాగే ఫ్రంట్ లోడ్ డ్రయ్యర్ లో బట్టలు త్వరగా ఆరిపోతాయి.. టాప్ లోడ్ అయితే కాస్త ఎక్కువ సమయం పడుతుంది.

know which washing machine is best front load or top load..!!
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ టాప్ లోడ్ కంటే ఖరీదు ఎక్కువే. కానీ, టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు బాగా క్లీన్ చేస్తాయి, ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉంటాయి, నీరు కూడా తక్కువ వాడతాయి. ఎలెక్ట్రిసిటీ కూడా తక్కువే వాడతాయి.

know which washing machine is best front load or top load..!!

అంతే కాక, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో ఎక్కువ వాష్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అన్ని ఫ్యాబ్రిక్ టైప్స్ కీ, అన్ని సాయిల్ లెవెల్స్ కీ తగిన ఫీచర్స్ ఫ్రంట్ లోడ్ లో ఉంటాయి. పైగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు తక్కువ చప్పుడు చేస్తాయి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు కొనేప్పుడు ఖరీదనిపించినా లాంగ్ రన్ లో అవి ఇచ్చే సౌకర్యాలకీ, దాని ఖరీదుకీ సరిపోతుంది. ఎన్విరాన్మెంటల్ సస్టెయినబిలిటీకి ఫ్రంట్ లోడ్ మెషీన్లే అనువైనవి.

know which washing machine is best front load or top load..!!
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల మీద ఉన్న ఒక పెద్ద కంప్లైంట్ ఏమిటంటే కాలం గడిచే కొద్దీ డోర్ యొక్క రబ్బర్ గాస్కెట్ మీద మోల్డ్ బిల్డప్ అవుతుంది. అంటే, టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ కి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం పడుతుంది. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ నీటిని కిందకి లాగుతాయి కాబట్టి అందులో ఈ ప్రాబ్లమ్ ఉండదు.


You may also like