Ads
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వాఖ్యలు ఈమధ్య దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే చాలామందికి సనాతన ధర్మం అంటే ఏమిటి? హిందూ ధర్మం అంటే ఏమిటి? ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటో కూడా తెలియదు.
Video Advertisement
మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్న పదం హిందూ ధర్మం. కానీ సనాతన ధర్మం అనే పదం వాడుక తగ్గిపోయింది. ప్రపంచంలోని పురాతన సాహిత్యమైన వేదంలో ఈ పదం ప్రస్తావన ఉంది. సనాతన ధర్మం ఆధ్యాత్మిక స్వభావం ఉంటుంది. ఇది ఆత్మను సూచిస్తుంది.
అందుకే సనాతన ధర్మం వ్యక్తి నుంచి వ్యక్తికి మారదు. సనాతన ధర్మం అనేది చాలా సంపూర్ణమైనది. ఇది అనాధిగా వస్తున్నది. ఈ ధర్మాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. వీటికి దేవాలయాలు లేదా ఇతర ప్రార్థన స్థలాలు ఉండక్కర్లేదు. ఈ ధర్మంలో ఎలాంటి ఆచారాలు ఉండవు. సనాతన ధర్మంలో దానగుణం, స్వచ్ఛత, పరోపకారం, దయ, ఓర్పు, సహనం, ఆత్మనిగ్రహం, తపస్సు వంటి అనేక గుణాలు ఉంటాయి. ఏం ఆశించకుండా సేవ చేయాలనే గుణం ఉండేది సనాతన ధర్మం.
హిందూ ధర్మం గురించి వేదాలు, పురాణాల వంటి గ్రంథాల ఎక్కువగా చెబుతున్నాయి. ఈ పదాన్ని మొదట సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉపయోగించేవారని.. అలా హిందూ అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ పదం ఒక సంప్రదాయంగా అభివృద్ధి చెంది మారింది.
హిందూ ధర్మం వాళ్లు గతంలో చేసిన కర్మల వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిర్ణయించేది. భక్తి, కర్మ, జ్ఞానంతో సత్యాన్ని తెలుసుకోవడమే హిందూ ధర్మం. ఇందులో ఎక్కువగా సాధులు, బాబాలు వంటివారు ఉంటారు. సిక్కు, జైన, వైష్ణవం మతాల కలయిక హిందూ ధర్మం. ఇందులో ఎందరో దేవుళ్లు ఉంటారు. ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి.
ALSO READ : భర్త లేని ఆడవారు పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చా..? శాస్త్రం ఏం చెప్తోందంటే..?
End of Article