మనం సాధారణం గా ఉపయోగించే వాటర్ బాటిల్స్ కి, కూల్ డ్రింక్స్ ను స్టోర్ చేసి అమ్మే బాటిల్స్ కి తేడా ఉంటుంది. ఈ తేడా ఎప్పుడైనా గమనించారా..? సాధారణం గా ఉండే వాటర్ బాటిల్స్ కి కింద బేస్ ఫ్లాట్ గా ఉంటుంది. కానీ, కూల్ డ్రింక్స్ ను స్టోర్ చేసి అమ్మే బాటిల్స్ కి మాత్రం కింద ఫైవ్ – పాయింటెడ్ టిప్ బేస్ ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఇలా ఎందుకు డిజైన్ చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

మాములుగా ఉన్న బాటిల్ కంటే, బాటిల్ బేస్ వద్ద ముడతలు లేదా ఏదైనా డిజైన్ ఉన్న బాటిల్స్ ఎక్కువ బలం గా ఉంటాయి. అదెలా అంటే.. ఇపుడు మీరు ఏదైనా ఒక పేపర్ షీట్ ని తీసుకుని మడవండి. అది మీకు చాలా ఈజీ గా అనిపిస్తుంది. కానీ, అదే షీట్ ని బెండ్ చేసి ఆ తరువాత మడవండి. అప్పుడు మీకు మునుపటి కంటే కొంత కష్టం అనిపిస్తుంది. అలాగే, ఆ షీట్ ని ఏదైనా పైప్ లోకి చుట్టి మాదవడానికి ట్రై చేయండి. అది ఇంకా కష్టతరం అవుతుంది. ఏదైనా పదార్థాన్ని వంచడం వల్ల దాని బలం మరియు దృఢత్వం మరింత పెరుగుతాయి.

pointed bottle

కూల్ డ్రింక్స్ ని చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట నిల్వచేసి అమ్ముతుంటారు. అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ వాల్యూం చాలా వరకు తగ్గుతుంది. అదే టైం లో, దాని ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెజర్ ను బాటిల్స్ తట్టుకోవాల్సి ఉంటుంది. కూల్ డ్రింక్స్ కార్బొనేషన్ వలన ఈ ప్రెజర్ ను సాధారణ బాటిల్స్ తట్టుకోవడం కష్టమవుతుంది. అదే ఫైవ్ – పాయింటెడ్ టిప్ బేస్ ఉన్న బాటిల్స్ అయితే ఈ ప్రెజర్ ని తట్టుకోగలవు. ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసమే ఫైవ్ – పాయింటెడ్ టిప్ బేస్ బాటిల్స్ ను డిజైన్ చేసారు. ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఫైవ్ – పాయింటెడ్ టిప్ బేస్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ను స్టోర్ చేయడానికి అనుకూలం గా ఉన్నాయి. అదే ప్యాకేజ్డ్ వాటర్ కార్బోనేటేడ్ కాదు. అందుకే వాటికి ఫ్లాట్ గా ఉన్న బాటిల్స్ అయినా సరిపోతాయి.