ప్రతి సినిమాకి మన హీరోలు ఒక వేరియేషన్ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంత మంది పాత్రల పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, కొంత మంది లుక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం హీరో లుక్స్. ఒకసారి అలాంటి లుక్స్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాదు.
Video Advertisement
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలు కొన్ని సినిమాల్లో ట్రై చేశారు. అందులో చాలా వరకు సక్సెస్ అయితే కొన్ని లుక్స్ మాత్రం ప్రేక్షకులు అంత పెద్దగా ఆదరించలేదు. అలా నిరాశపరిచిన మన హీరోల కొన్ని లుక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 జూనియర్ ఎన్టీఆర్
శక్తి సినిమా జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. అందులో ఒక పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ గెటప్ ప్రేక్షకులకు అంత పెద్దగా నచ్చలేదు.
#2 నాగార్జున
నాగార్జున హీరోగా నటించిన భాయ్ సినిమాలో కూడా నాగార్జున లుక్ కి చాలా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.
#3 చిరంజీవి
చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాలో గోవిందరాజు పాత్ర లుక్ ప్రేక్షకులని నిరాశపరిచింది.
#4 మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా ప్రేక్షకులకి నచ్చలేదు.
#5 ప్రభాస్
ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో చాలా చోట్ల డల్ గా కనిపించారు. మంచి పవర్ ఫుల్ సీన్ లో కూడా అంత యాక్టివ్ గా నటించలేకపోయారు ప్రభాస్. ప్రభాస్ కాస్ట్యూమ్స్ బాగున్నా కూడా ప్రభాస్ కి అంత సెట్ అయినట్టు అనిపించలేదు. దాంతో సాహో సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ మళ్లీ పాత ప్రభాస్ ని తెరపై చూడాలని ఉంది అని అన్నారు.
#6 వెంకటేష్
వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో సినిమాలో వెంకటేష్ లుక్స్ కి చాలా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా సినిమా ల డల్ గా కనిపించారు వెంకటేష్.
#7 అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులని అంత పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే తర్వాత వచ్చిన బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా ప్రేక్షకులని కొంత నిరాశ పరిచింది.
#8 బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమాలో పోలీస్ లుక్ సరిగ్గా డిజైన్ చేయలేదు అని ప్రేక్షకులు అన్నారు.
Also Read: “సారంగ దరియ” పాటలో “సాయి పల్లవి” పక్కన డాన్స్ చేసిన ఈ అమ్మాయిని గమనించారా.?
#9 పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్, స్టైల్ కి అనుకున్నంత మంచి రెస్పాన్స్ రాలేదు. అలాగే వకీల్ సాబ్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్నిచోట్ల కొంచెం డిఫరెంట్ గా కనిపించారు అని ప్రేక్షకులు అన్నారు.
#10 రామ్ చరణ్
రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో చాలా డల్ గా కనిపిస్తారు రామ్ చరణ్. ఆ హెయిర్ స్టైల్ కూడా అంత సెట్ అయినట్టు అనిపించదు. సినిమా హిట్ అయినా కానీ రామ్ చరణ్ లుక్ మాత్రం ప్రేక్షకులకి అంత కొత్తగా ఏమీ అనిపించలేదు.
అలా ఫెయిల్ అయిన టాలీవుడ్ హీరోల కొన్ని లుక్స్ ఇవే. ప్రేక్షకుల స్పందన తర్వాత మన హీరోలు కూడా లుక్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Also Read: చిరు కూతురుతో ఉదయ్ కిరణ్ పెళ్లి ఆగిపోవడానికి అసలు రీజన్ అదేనట వైరల్ గా మారిన అతని కామెంట్స్