అరటి పండు తింటే ఊబకాయం వస్తుందా.. వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి..

అరటి పండు తింటే ఊబకాయం వస్తుందా.. వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి..

by kavitha

Ads

సాధారణంగా బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. దానివల్ల నచ్చిన ఆహారాన్ని తినలేరు. ఇక అరటిపండ్లు లాంటి పండ్లను తింటే ఊబకాయం వస్తుందని అనుకుంటారు. అయితే అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కానీ  ఒబేసిటీని పెంచుతుందని భావిస్తుంటారు. అయితే ఇది ఒక అపోహే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Video Advertisement

మీడియం సైజులో ఉండే బనానలో 105 కేలరీలు ఉంటాయని, అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి దోహదపడుతుంది. ఆకుపచ్చని అరటిపండ్లలో పిండిపదార్ధం ఉంటుంది. ఇది కూడా బరువు తగ్గించడంలో మరియు రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గిస్తుంది.కొందరు ఆరోగ్య నిపుణుల చెప్తున్న దాని ప్రకారంగా అరటిపండు బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. ఎందుకంటే బరువు తగ్గించడానికి సాయపడే చాలా గుణాలు దీనిలో ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లను తినవచ్చు. ఆకుపచ్చగా ఉండే అరటికాయలో అధికంగా పిండి పదార్ధం ఉంటుంది. అందువల్ల అరటికాయను ఆహారంలో చేర్చుకుంటే మేలు.banana-uses-1ఇక పసుపు రగులో ఉండే అరటిపండులో ప్రోటీన్స్ చాలా తక్కువ. ఇది కండరాలకు అవసరమైన పోషకం. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు మీడియం సైజ్అరటిపండును  కొన్ని గింజలతో కలిపి తినడం మంచిది. అంతే కాకుండా అరటిపండ్లు పేగు హెల్దీగా ఉంచడానికి సాయం చేస్తుంది. దీనిలో పెక్టిన్ కూడా ఉంటుంది. పెక్టిన్ అనేది కరిగే ఫైబర్. పెక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే అరటిపండు కడుపులో మంటను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్ధం కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.
banana-uses-2 అరటి పండు తినడం వల్ల చాలా సమయం పాటు పొట్టనిండుగా ఉంటుంది. అందువల్ల త్వరగా ఆకలి అవదు. దీనివల్ల అనారోగ్యకరమైన ఫుడ్ ను తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అరటిపండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. తద్వార గుండె వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధితమైన సమస్యలను నివారిస్తుంది.banana-uses1Also Read: నేరేడు పండు అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..


End of Article

You may also like