నేరేడు పండు అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..

నేరేడు పండు అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..

by kavitha

Ads

సమ్మర్ లో ఎక్కువగా కనిపించే నేరేడు పండులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. చిన్నగా కనిపించే నేరేడు పండు ఆరోగ్య పరంగా చాలా పెద్దది అని చెప్పవచ్చు. ఈ పండులో పోషకాలు మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

Video Advertisement

నేరేడు పండు రోగనిరోధక శక్తి పెంచుతుంది. అంతే కాకుండా క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులను రాకుండా చేస్తుంది. నేరేడు పండు గుజ్జు, నేరేడు ఆకుల్లో ఉండే కెర్నల్ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఈ పండుని హోమియోపతి, ఆయుర్వేదంలో వాడుతారు. నేరేడు పండు గింజలు రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా చర్మం యొక్క మెరుపును కూడా పెంచుతాయి. జీర్ణక్రియ రేటుని మెరుగుపరుస్తుంది.
jamun-uses-health-benefits1 ఈ మధ్యకాలంలో మధుమేహం అనేది సర్వసాధారణ విషయంగా మారింది. కొందరికి చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి క్రమంగా శరీరంలోని మిగిలిన భాగాలను దెబ్బతీస్తుంది. అయితే మధుమేహం నియంత్రించుకొవడం అనేది చాలా ముఖ్యం. దీని కోసం సహజమైన పద్ధతులనుపాటించవచ్చు. నేరేడు పండు గింజల పొడి డయాబీటీస్ కంట్రోల్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని ఆయుష్ అధికారులు సూచించారు.
jamun-uses-health-benefitsనేరేడు ఉపయోగాలు:

1. నేరేడు పండు, నేరేడు ఆకులు, గింజలు మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటాయి. నేరేడు గింజల పొడిలో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్స్ స్టార్చ్‌ను షుగర్ గా మార్చడాన్ని అడ్డుకుంటాయి. మధుమేహ పేషెంట్లకు నేరేడు ఎంతగానో మేలు చేస్తుంది.

2. నేరేడులో పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నేరేడు గింజల పొడి ప్రేగు యొక్క కదలికలను మెరుగుపరుస్తుంది. షుగర్ పేషెంట్లకు ఆహారం జీర్ణం అవడం కోసం నేరేడు పండు కానీ, నేరేడు గింజల పొడిని తీసుకోవచ్చు.

3. శరీరంలోని టాక్సిక్ పదార్ధాలను తొలగించడంలో నేరేడు బాగా పనిచేస్తుంది. నేరేడు గింజల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తుంది.

4. నేరేడు గింజల పొడి, ఆకులు చర్మానికి మేలు చేస్తాయి. నేరేడు చూర్ణాన్ని వాడడం వల్ల చర్మం పొడిబారడం తగ్గడమే కాకుండా మెరుపును సంతరించుకుంటుంది.

5. ఎన్నో పరిశోధనలలో నేరేడు పండు రక్తపోటును నియంత్రణలో ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలుపబడింది.

Also Read: వేసవి కాలంలో ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా చలవ కూడా చేస్తుంది..


End of Article

You may also like