Ads
మనలో చాలా మంది భోజనం చేసాక కొన్ని పనులను తెలిసో..తెలియకో చేస్తూ ఉంటాం. అయితే.. ఈ పనులను ఇప్పటికైనా మానుకోవడం మంచిది. ఎందుకంటే.. తిన్న వెంటనే మన శరీరానికి మనం తిన్న ఆహార పదార్ధాలలోని పోషకాలని అందుకునే సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకుండా పనులు చేయడమో.. నిద్రపోవడమో చేయడం వలన మన శరీరం పోషకాలను గ్రహించలేదు. ఇంతకీ.. భోజనం చేసాక ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
#1. చాలా మంది భోజనం చేయగానే స్నానం చేస్తూ ఉంటారు. తిన్నాక కనీసం అరగంట సమయం అయినా గ్యాప్ ఇవ్వాలి. లేదంటే గ్యాస్ సంబంధిత సమస్యలు చుట్టుముట్టి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
#2. మరి కొందరు తిన్న వెంటనే.. ఏవో ఒక ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ ఆహరం తిన్నాక ఫ్రూట్స్ తీసుకోవడం వలన మన శరీరం మనం తిన్న భోజనం లోని పోషకాలను గ్రహించలేదు.
#3. అలాగే.. తిన్న వెంటనే నడిస్తే మంచిది అనుకుంటారు. కానీ వేగం గా నడవడం కూడా ప్రమాదమే. త్వరగా జీర్ణం అయ్యి.. శరీరం పోషకాలను పొందలేదు. అందుకే చాలా నెమ్మది గా నడవాలి.
#4. చాలామంది తినగానే నిద్రపోతు ఉంటారు. ఇది కూడా మంచి అలవాటు కాదు. అన్నం తినగానే నిద్రపోవడం వలన బాగా బరువు పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
#5. ఆఫీసుల్లో పని చేసే వారు చాలా మంది లంచ్ టైం లో బెల్ట్ ను పెట్టుకునే భోజనం చేస్తూ ఉంటారు. దీనివలన ఆహరం సరిగ్గా జీర్ణం కాదు. తినేటపుడు పొట్టను బెల్ట్ తో నిర్బంధించడం వలన అనేక ఉదర సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
#6. కొంతమంది అన్నం తిన్నాక వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు. తినగానే వ్యాయామం చేయడం వలన కడుపుకు తిమ్మిరి రావడం, జీర్ణ సంబంధ సమస్యలు రావడం వంటివి జరుగుతుంటాయి.
#7. అలాగే, తిన్న వెంటనే టీ, కాఫీలను తీసుకోవడం కూడా మంచిది కాదు. కనీసం మూడు నాలుగు గంటల సమయం అయినా ఇవ్వాలి.
#8. కొందరైతే.. తిన్నాక ఈత కొట్టడం వలన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందని చెబుతుంటారు. ఇది కూడా మంచిది కాదట. జీర్ణ క్రియ కు.. ఈత కు ఎలాంటి సంబంధం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
#9. చాలా మంది అన్నం తిన్నాక సిగరెట్ తాగకపోతే ఇది గా ఫీల్ అవుతూ ఉంటారు. అన్నం తిన్నాక ఒక్క సిగరెట్ తాగినా.. అది పది సిగరెట్లకు సమానం గా ఉంటుంది. ఇది కాన్సర్ రావడానికి కారణం అవుతుంది.
End of Article