Ads
“Daily an apple keeps a doctor away” అనేది ఇంగ్లీష్ సామెత. అంటే.. రోజు ఒక ఆపిల్ ను తింటే డాక్టర్ ను దూరం గా ఉంచొచ్చట. అంటే.. ఆరోగ్యవంతం గా ఉంటాము. అస్తమానం వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అర్ధం. కానీ ఏదైనా ఒక పరిమితి వరకే ఆరోగ్యాన్ని ఇస్తాయి. మితి మీరు చేసే పని ఏదైనా చివరకు అనర్ధాన్నే కలిగిస్తుంది. అందుకే అతి సర్వత్ర వ్యర్జయేత్ అని పెద్దలు చెబుతుంటారు.
Video Advertisement
ఆపిల్స్ తింటే మంచిది కదా అని చెప్పి.. ఎక్కువ మోతాదులో ఆపిల్స్ ను తినడం కూడా అంత మంచిది కాదట. రోజుకు ఒకటి లేదా రెండు ఆపిల్స్ తింటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయట. ఆపిల్స్ లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయట. అలాగే, ఆపిల్స్ లో అధిక శాతం పీచు పదార్ధాలు ఉంటాయి. ఇవి జీర్ణ క్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, ఎక్కువ మోతాదులో ఆపిల్స్ తీసుకుంటే కడుపు ఉబ్బరం కలుగుతుంది. అలాగే, మలబద్ధకం సమస్య కూడా ఎదురవుతుంది.
అలాగే ఆపిల్స్ లో కార్బోహైడ్రాట్లు కూడా ఎక్కువ మోతాదు లో ఉంటాయి. ఎక్కువ ఆపిల్స్ ను తీసుకున్నపుడు రక్తం లో చక్కర స్థాయి కూడా పెరుగుతుందట. అందుకే మధుమేహం ఉన్నవారు ఆపిల్ పండ్లను ఎక్కువ గా తినకూడదు అని చెబుతుంటారు. ఇది వరకే మల బద్ధకం, గ్యాస్ ట్రౌల్ వంటి సమస్యలు ఉన్నవారు ఆపిల్స్ ను దూరం పెట్టాలి. ఆపిల్స్ లో ఉండే చక్కర పదార్ధాలను జీర్ణం చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది.
మరో విషయం ఏమిటంటే, ఆపిల్స్ పండు పై మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ మొత్తం లో పురుగుల మందు అవశేషాలు ఉండే అవకాశం ఉంది. పంట పండించే సమయం లో చల్లే రసాయనాలు ఎక్కువ హాని కలిగిస్తాయి. ఆపిల్స్ పై డిఫెనిలామైన్ అనే రసాయనం ఎక్కువ మోతాదు లో ఉంటుంది. అందుకే వీటిని తినేముందు విధిగా వేడి నీటిలో కడిగి తినాలి. అలాగే ఎక్కువ ఆపిల్స్ ఆహరం గా తీసుకున్నా బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే, వీటిలో ఉండే ఆమ్లం దంతాలపైన ఉండే ఎనామెల్ పొరను దెబ్బతీస్తుంది. అందుకే ఎక్కువ గా తినకుండా.. జాగ్రత్తలు తీసుకోండి.
End of Article