పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులు నేలపై ఉంచకండి.! ఇలా చేస్తే దరిద్రమే!

పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులు నేలపై ఉంచకండి.! ఇలా చేస్తే దరిద్రమే!

by Anudeep

Ads

మన దేశంలో ఎక్కువ శాతం ప్రజలు సనాతన హిందూధర్మాన్ని పాటిస్తారు. తమ ఇష్ట దైవాన్ని పూజించడం ద్వారా తమ అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.

Video Advertisement

కానీ తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడంవల్ల అది మనకు మేలు చేయడం జరుగుతుంది అనే మాట పక్కన పెడితే, లేనిపోని అనర్థాలు తెచ్చిపెడుతుంది.

God room

పూజ గది లో చేయకూడని ఆ నాలుగు పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

#1. దీపారాధన:

Dheepam

సాధారణంగా మనం దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగించి దేవుడు ముందు పెడతాం.  పూర్వకాలంలో  పూజగది అనేది ఒక మండపం లాగా ఉండేది.  ఇప్పటి కాలంలో సొంతంగా నిర్మించిన గృహంలో పూజగది అనేది ఒక చిన్న అలమరలా కడుతున్నారు. ఈ చిన్న అలమర లోనే మన దేవుడు పటాలు మొత్తం అమర్చుకుంటాం. దీపం వెలిగించేటప్పుడు ఖాళీ లేక నేలమీద పెడతాము. ఇలా చేయడం అనేది అశుభంతో సమానం. ఎందుకంటే చనిపోయిన వారికి మాత్రమే దీపం అనేది నేల మీద పెడతారు. అందుకే దీపం అనేది దేవుని ఎదుట ఏదన్నా ఒక ప్లేట్లో గాని లేక తమలపాకుపైన గాని అమర్చి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితం కలుగుతుంది.

#2. విగ్రహాల అమరిక :

God set

మనం పూజగదిని శుభ్రం చేసేటప్పుడు దేవుడు పటాలు మరియు విగ్రహలు ఏదైనా పీఠ మీద గానీ లేదా శుభ్రమైన వస్త్రం మీద గాని ఉంచాలి. మనకు తెలియక నేలమీద పెట్టేస్తూ ఉంటాం. ఇలా చేయడంవల్ల దేవతలను అవమానించినట్లు, దీని వలన ఇంటిలోని శాంతి కరువవుతుంది అని వేద బ్రాహ్మణులు వెల్లడిస్తున్నారు.

#3. నగలు :

Goddess jewelry decoration

మనం ధరించే బంగారు ఆభరణాలు విలువైన వజ్ర వైఢూర్యాలు లక్ష్మీదేవి తో సమానం. అదే విధంగా దేవతలకు అలంకరించే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో నేలమీద ఉంచకూడదు. నేల మీద ఆభరణాలు ఉంచడం వల్ల మనం తిరిగే కాలు ధూళి వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలా ధూళి అంటుకున్న  ఆభరణాలను దేవత విగ్రహాలకు అలంకరించడం ద్వారా మనం దేవతలను అవమానించినట్లే అవుతుంది.

#4. శంఖం :

Sankam

శంఖం అనేది లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. శంఖం ఇంటిలోని దేవుని ఎదుట ఊదడం వల్ల ఇంటికి సకల శుభాలూ కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శంఖాన్ని నేలపై ఉంచకూడదు. శంఖని కనుక తెలియక నేలమీద పెట్టినట్లయితే ఆర్థిక బాధలతో ఇబ్బంది పడతారు.

ఈ నియమాలు  నాలుగు పాటించడం ద్వారా మన జీవితంలో చక్కని శుభ ఫలితాలు కలుగుతాయని వేద  పండితులు వెల్లడిస్తున్నారు.


End of Article

You may also like