తలుపులు ఉన్న వైపు కాళ్ళు పెట్టి నిద్రిస్తే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోండి..!

తలుపులు ఉన్న వైపు కాళ్ళు పెట్టి నిద్రిస్తే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోండి..!

by Anudeep

Ads

మనం రోజంతా ఎంత పని చేసినా.. ఎక్కడ తిరిగి అలసిపోయినా.. రాత్రయ్యే సరికి ప్రశాంతం గా నిద్రపోవాలి అని అనుకుంటాం. ఎందుకంటే మంచి నిద్ర మనకి అవసరమైన ఎనర్జీ ని అందిస్తుంది కాబట్టి. అందుకు తగ్గట్లే మన బెడ్ ని కూడా చక్కగా ఉంచుకుంటాం. కానీ, వీటన్నటికంటే మనం ఎటువైపు ఉండి నిద్రపోతున్నాం అన్న సంగతి కూడా చాలా ముఖ్యమైనది.

Video Advertisement

sleeping

దిక్కులను చూపిస్తే.. తూర్పు, పడమర దిక్కుల్లో పడుకోవడం మంచిదని.. ఉత్తర దిక్కు వైపు పడుకోకూడదని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. అయితే.. తలుపులు ఉన్న వైపుకు కూడా కాళ్ళు పెట్టి నిద్రించకూడదట. తలుపులు వున్నా వైపుకు తల వచ్చేలా ఉంచి నిద్రించాలట. పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఒక బలమైన కారణమే ఉండి ఉంటుంది.

sleeping 2

కాళ్ళు తలుపులు ఉన్న వైపుకు పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ మన వైపుకు వచ్చే అవకాశం ఉంటుందట. అలా చేయడం వలన ప్రశాంతమైన నిద్ర పట్టదట. ఉదయం లేచిన తరువాత కూడా అలసట ఉంటుంది. ఎవరైనా చనిపోయినపుడు వారి కాళ్ళని తలుపులువైపుకు ఉంచి బయటకు తీసుకు వెళ్తారు. అందుకే.. కాళ్ళు తలుపులవైపుకు ఉంచి నిద్రించకూడదని.. అలా చేయడం వలన దెయ్యాలను ఆహ్వానించినట్లు అవుతుందని పెద్దలు చెబుతుంటారు.

sleeping 1

పెద్దలు ఏమి చెప్పినా దానికి ఓ కారణం ఉంటుంది. గుమ్మం గుండా నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. అందుకే పెద్దలు మనకి ఇలాంటి విధి విధానాలను ఏర్పరిచారు. మీరు కూడా పడుకునేటప్పుడు ఎటువైపు పడుకుంటున్నారో చెక్ చేసుకోండి.


End of Article

You may also like