Ads
వారమంతా కష్టపడి పని చేసి వీకెండ్ కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. చాలా మంది వర్కింగ్ డే లో బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇక స్టూడెంట్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆదివారం ఎప్పుడొస్తుందా? ఎప్పుడు రిలాక్స్ అవుదామా..? అని ఎదురు చూస్తూ ఉంటారు.
Video Advertisement
కానీ.. కొన్ని పనులను ముందుగానే చేసి పెట్టేసుకోవడం వల్ల వర్కింగ్ డేస్ లో స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి రోజుని రిలాక్స్డ్ గా హ్యాపీగా గడిపేయచ్చు. అయితే ఇలా గడపడానికి ముందు మనం చేసే తప్పులేంటో తెలుసుకోవాలి.
చాలా మంది రాత్రి సమయాల్లో మొబైల్ చూస్తునో, సినిమాలు చూస్తునో లేట్ గా పడుకుంటూ ఉంటారు. అయితే.. ఈ ప్రభావం మరుసటి రోజుపై పడుతుంది. ఉదయాన్నే త్వరగా లేవలేకపోతారు. లేచినా ఉత్సాహం ఉండదు. బద్ధకంగా, మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మహిళలకైతే ఇంటి పనులు సరేసరి. అందుకే మరుసటి రోజు చేయాల్సిన పనుల గురించి రాత్రి పడుకునే ముందు ఓ సారి ఆలోచించుకోవాలి.
రేపటికి ఏమి చేసుకోవాలి.. ఏ టైం లో చేసుకోవాలి అన్నది ఒక ఐడియా ఉంచుకోవాలి. రాత్రి త్వరగా పడుకోవాలి. ఉదయాన్నే లేవగానే చేతిలోకి మొబైల్ తీసుకోకూడదు. ముందుగా మీరు నిద్ర లేచేటపుడు మీ కుడి వైపు నుంచి మంచం దిగాలి. అలాగే.. లేవగానే మీ అరచేతులను చూసుకోవాలి. ఆ తరువాత మీ బాల్కనీ గాని, బయట కానీ, గార్డెన్ కి కానీ వెళ్ళాలి.
పచ్చని చెట్లను ఎక్కడ వీలైతే అక్కడ కూర్చుని చూస్తూ ఒక్క ఐదు నిముషాలు గడపాలి. ప్రకృతి నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ ను ఉదయాన్నే తీసుకోవడం వలన మీ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఉదయాన్నే మంచి మూడ్ డెవలప్ అవుతుంది. ఆరోజు ఎన్ని పనులు వచ్చిన చేసేయగలం అన్న ధీమా కలుగుతుంది. ఒక పది నిమిషాల తరువాత మీ దినచర్యని ప్రారంభించాలి. త్వరగా నిద్ర లేవడం వలన మీకు కావాల్సినంత సమయం ఉంటుంది. కాబట్టి మీరు పనులు చేసుకునేటప్పుడు టెన్షన్ పడరు. ఎన్ని పనులు ఉన్న కూల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే ఉదయాన్నే మంచి మూడ్ ని డెవలప్ చేసుకోవడం చాలా అవసరం.
End of Article