మీ జీతం పెరిగిందా? అయితే వెంటనే ఈ పని చేయండి..!

మీ జీతం పెరిగిందా? అయితే వెంటనే ఈ పని చేయండి..!

by Anudeep

Ads

ఇటీవలే కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైన సంగతి తెలిసిందే. కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చాక అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలను పెంచడం సహజమే. అయితే చాలా మంది పెరిగిన జీతానికి ఏ ఖర్చులు ఉన్నాయో అని ఆలోచించుకుంటారే తప్ప.. ఎక్కడ పొదుపు చేయాలి అన్న సంగతి మాత్రం ఆలోచించరు.

Video Advertisement

అయితే శాలరీ పెరిగినప్పుడు వెంటనే ఖర్చు పెట్టేయడం కాకుండా, భవిష్యత్ అవసరాల కోసం కొంచం పొదుపు చేస్తే ఉపయోగం ఉంటుందని అంటున్నారు. భవిష్యత్ లో ఆర్ధిక కష్టాలు రాకుండా నిలదొక్కుకోవచ్చని అంటున్నారు.

money

రుణాలు తీర్చుకోవడం: చాలా మంది బైక్, హౌస్, లేదా కార్ వంటి వాటిని లోన్ పెట్టి తీసుకుంటూ ఉంటారు. ఇలా శాలరీ పెరిగినప్పుడు ఆ ఈఎంఐ ని ఎక్కువ మొత్తంలో కట్టేయడం ద్వారా తొందరగా రుణాన్ని తీర్చేసుకోవాలి. మీరు నెలకి పది వేల ఈఎంఐ చెల్లిస్తుంటే.. మీ జీతం మరో పదివేలు పెరిగిందనుకుంటే.. మీరు నెలకి కట్టే ఈఎంఐ ను మరో ఐదు నుంచి పది వేలకు పెంచుకోవడం ద్వారా త్వరగా రుణాన్ని తీర్చుకోవచ్చు. గడువు కంటే ముందే రుణాన్ని తీర్చేయడం వలన వడ్డీ కూడా తగ్గుతుంది. మీకు కొంత మొత్తం మిగులుతుంది. పరోక్షంగా మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. తద్వారా మీకు తక్కువ మొత్తంలోనే ఋణం లభిస్తుంది.

అలాగే మీకు జీతం పెరిగినప్పుడు దానిలో కొంత భాగాన్ని అత్యవసర నిధుల కోసం దాచుకోవడం కూడా ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే అవసరాలు చెప్పి రావు.. అందుకే డబ్బుని అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే పిల్లల చదువులు, రిటైర్మెంట్, భవిష్యత్ కోసం బీమా పధకాలను ఎంచుకోవడం కూడా మంచి పద్ధతి. ఇలా తీసుకుంటే అత్యవసర సమయాల్లో డబ్బు ఖర్చు అవ్వకుండా భీమా కాపాడుతుంది. అయితే జీతాలు పెరగగానే చాలా మంది సరదాల కోసం యాక్సెసరీస్, ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలనుకోవడం సహజమే. అయితే ఇందుకోసం కొద్దీ మొత్తంలో వెచ్చించి ఎక్కువగా సేవ్ చేసుకోవడం మంచిది.


End of Article

You may also like