పౌర్ణమి ముందు వచ్చే ఈ ఆదివారం ఇలా చేస్తే సిరి సంపదలు మీ వెంటే..

పౌర్ణమి ముందు వచ్చే ఈ ఆదివారం ఇలా చేస్తే సిరి సంపదలు మీ వెంటే..

by Anudeep

Ads

కొందరు ఎంత సంపాదించిన వారి చేతులలో సంపద అనేది నిలకడ లేకుండా పోతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. మా పై చెడు దృష్టి పడింది అంటూ, అందుకే మేము ఇలా అప్పుల్లో కూరుకు పోతున్నమంటూ బాధపడుతూ ఉంటారు.  మరి కొందరు ఎంత తక్కువ సంపాదించినా సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు.

Video Advertisement

మరి అలాంటి సిరిసంపదలకు నిలయమైన దేవత లక్ష్మీ మాత. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే, కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. పౌర్ణమికి ముందు వచ్చే ఈ ఆదివారము ఎంతో విశిష్టమైనది. ఈ ఆదివారం నాడు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మొదటగా మనం చేసే పనులను సక్రమంగా చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కచ్చితంగా పొందవచ్చు.

పూర్వీకుల నుంచి సంక్రమించిన ఈ ఆచారాలు పాటించడం ద్వారా  మనకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ ఆదివారం నాడు ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేచి, తలంటు స్నానం ఆచరించి, శుభ్రమైన అయినా వస్త్రాలు ధరించాలి. సూర్యోదయానికి ముందే పూజ గదిలో నువ్వుల నూనెతో గాని, ఆవు నెయ్యితో గాని దీపారాధన చేయాలి. ఒక రాగి చెంబు లేక గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకుని, దానిలో కొంచెం రాళ్ల ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇంటి ముఖ ద్వారము కుడివైపుగా ఉంచండి. సూర్యోదయం అయిన తర్వాత, ఆ నీటిని ఇంటి గడపపైన, వాకిటిలో చల్లండి. ఇలా చేయడం ద్వారా చెడు దృష్టి అనేది పోయి, నెగిటివ్ ఎనర్జీ అనేది లోనికి రాకుండా కాపాడుతుంది.

ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుందో, లక్ష్మీదేవి మీ నివాసంలో స్థిరంగా ఉండి సకల అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది.


End of Article

You may also like