ఈ మధ్య చాలా చోట్ల వెస్ట్రన్ టాయిలెట్ మోడల్స్ ఎక్కువ దర్శనమిస్తున్నాయి. ఇవే అలవాటయిపోయి కొందరు.. కింద కూర్చోలేక మరికొందరు.. ఇలాంటి వాటిని ఇళ్లల్లో అమర్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే.. లేటెస్ట్ గా వస్తున్న మోడల్స్ లో మీరొక విషయం గమనించారా..?

Video Advertisement

dual flush 1

ఈ మోడరన్ టాయిలెట్స్ లో రెండు ఫ్లష్ బటన్స్ వస్తున్నాయి. వాటిల్లో ఒకటి పెద్దది గా.. మరొకటి చిన్నది గా ఉంటున్నాయి. ఇలా ఎందుకు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా రెండు ఫ్లష్ బటన్స్ ఉండడాన్ని డ్యూయల్ ఫ్లష్ అని పిలుస్తారు. ఈ రెండు బటన్లు ఎగ్జిట్ వాల్వ్ కు అమర్చబడి ఉంటాయి. ఈ రెండు బటన్లు వేర్వేరు ఎత్తులలో ఓపెన్ అవుతూ నీటిని బయటకు పంపుతుంటాయి.

dual flush 2

చిన్న ఫ్లష్ బటన్ ఎక్కువ ఎత్తు లో ఉండి తక్కువ నీటిని బయటకు పంపుతుంది. పెద్ద బటన్ లోయర్ ఎగ్జిట్ వాల్వ్ కు కనెక్ట్ అయి ఉండి ఎక్కువ నీటిని బయటకు పంపుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, పెద్ద బటన్‌ను నొక్కితే 6 నుండి 9 లీటర్ల నీరు లభిస్తుంది, మరియు చిన్న బటన్‌ను నొక్కితే 3 నుండి 4.5 లీటర్ల నీరు వస్తుంది. ఘన వ్యర్ధాలను ఫ్లష్ చేయడం కోసం పెద్ద బటన్ ను, ద్రవ వ్యర్ధాలను ఫ్లష్ చేయడం కోసం చిన్న బటన్ ను రూపొందించారు.

dual flush 3

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, డ్యూయల్ ఫ్లష్ ను అమర్చుకోవడం వలన ఒక ఇంట్లో దాదాపు ఇరవై వేల లీటర్ల వరకు ఆదా చేయవచ్చట. ఆశ్చర్యం గా ఉన్నా ఇది నిజం. సింగల్ ఫ్లష్ కంటే డ్యూయల్ బటన్ ఫ్లష్ అమర్చుకోవడం కొంత ఖరీదు అయినా, నీటిని ఆదా చేయడం లో డ్యూయల్ ఫ్లష్ బెస్ట్ ఛాయస్ గా నిలుస్తుంది. అవసరానికి తగ్గట్లు ఫ్లష్ చేయడం డ్యూయల్ ఫ్లష్ బటన్ మోడల్ తో సాధ్యం అవుతుంది.