Ads
మనం తాగే వాటర్ బాటిల్ ఖరీదు ఎంత..? ఇరవై రూపాయలు కదా.. మహా అయితే పాతిక రూపాయలు. అయినా సరే, మనం అస్తమానం బాటిల్ ను కొనం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి వాటర్ బాటిల్ ని కూడా తీసుకుని వెళ్తాము. మరీ అవసరం అయితే తప్ప వాటర్ బాటిల్ ని మనం కొనము. మరి అలాంటిది.. సెలెబ్రిటీలు మాత్రం వేలకు వేలు పోసి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు. అంత ఖరీదు పెట్టి వారు ఆ వాటర్ నే ఎందుకు తాగుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
విరాట్ కోహ్లీ గురించి పరిచయం అవసరం లేదు. విరాట్ తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా..? ఆరువందల రూపాయలు. “ఎవియన్” బ్రాండ్ వాటర్ ని మాత్రమే విరాట్ తాగుతాడు. మ్యాచ్ కోసం ఏ కంట్రీ కి వెళ్లినా, ఏ హోటల్ కి వెళ్లినా అతనితో పాటు “ఎవియన్” బ్రాండ్ వాటర్ బాటిల్ ఉండాల్సిందే. విరాట్ మాత్రమే, కాదు చాలా మంది సెలెబ్రిటీలు, స్పోర్ట్స్ మెన్లు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ తాగుతుంటారు. అసలు అవి ఏమిటో..?వాటికి అంత ప్రత్యేకత ఎందుకొచ్చిందో తెలుసుకుందాం.
#1 హవాయి కోనా నిగరి వాటర్..
ఇవి ప్రపంచం లోనే అత్యంత ఖరీదైనవి. ఈ వాటర్ తాగడం వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాదు, బరువు తగ్గి చర్మం కూడా నిగారింపు ను సంతరించుకుంటుందట. అలాగే మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుందని నమ్ముతారు. హవాయికి దగ్గర్లో ఉండే పసిఫిక్ సముద్ర తీరం వద్ద రెండు వేల అడుగుల లోపలకి తవ్వి నీటిని వెలికితీస్తారు. అందుకే ఈ నీరు అంత కాస్ట్లీ. కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ నీటిలో ఉండే లవణాన్ని పోగొట్టి తాగే నీటిగా మార్చి బాటిల్స్ లో నింపుతారు. ఈ నీరు స్వచ్ఛం గా ఉండడమే కాదు.. ఎన్నో ఖనిజ లవణాలు కూడా ఈ నీటిలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ నీటికి జపాన్ లో బాగా డిమాండ్ ఉంది. అక్కడ రోజుకు ఎనభై వేలకు పైగా కోనా నిగరి వాటర్ బాటిల్స్ దిగుమతి అవుతాయట.
#2 బ్లింగ్ హెచ్ టు ఓ..!
ఈ బాటిల్ లోని వాటర్ మాత్రమే కాదు., బాటిల్ కూడా చాల ఖరీదైనది. ఎంతో ఆకర్షణీయం గా ఈ బాటిల్ ని తీర్చిదిద్దారు. టేనేస్సి దగ్గర ఉండే నీటి బుగ్గల నుంచి నీటిని సేకరించి ఈ బాటిల్స్ లో నింపుతారు. ఈ బాటిల్స్ ను స్వరోవ్స్కి రాళ్లతో తీర్చిదిద్ది అందం గా డిజైన్ చేసారు. ఈ బాటిల్ లో వాటర్ ధరకి బాటిల్ ధర అదనం గా పడుతుంది.
#3 వీన్:
ఈ బాటిల్ లో నీటిని తాగినప్పుడల్లా సుతిమెత్తనిదేదో నాలుకపై తగిలినట్లు అనిపిస్తుంది. ఈ నీరు అంత స్వచ్ఛం గా ఉంటాయట. కాలుష్యం లేకుండా, స్వచ్ఛమైన ప్రాంతాల్లోని నీటి బుడగలు సేకరించి ఈ నీటిని తయారు చేస్తుంది వీన్ కంపెనీ. ఈ కంపెనీ ఫిన్లాండ్ కు చెందినది. అలా హిమాలయ ప్రాంతాలనుంచి, లాప్ ల్యాండ్ నుంచి, ప్రపంచం లోనే ప్రకృతి సంపద ఎక్కువ గా ఉన్న భూటాన్ దేశం నుంచి కూడా ఈ కంపెనీ నీటిని సేకరిస్తుంది.
#4 10 థౌజండ్ కంపెనీ :
కెనడా లోని వాంకోవర్ సిటీ నుంచి ఒక రెండొందల కిలోమీటర్ల దూరం వెళ్తే, అక్కడ జనసంచారం ఉండదు. జంతువులు కూడా ఉండవు. అక్కడ హిమనీ నదాలు ఉంటాయి. దాదాపు ఆరువేల అడుగుల లోతు వరకు ఈ నదాలు ఉన్నాయి. వాటిని కరిగించి ఆ నీటిని బాటిల్స్ లో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ చోటుకు ఎవరు వెళ్ళలేరు, జంతువులు కూడా ఉండవు. అందుకే అక్కడి నీరు స్వచ్ఛం గా ఉంటుంది. పైగా, ఈ నీటిని తాగడం వలన చర్మ సంబంధిత రోగాలు రావని ఈ కంపెనీ చెబుతోంది. ఈ హిమానీ నదాలు పద్దెనిమిది వేల సంవత్సరాలక్రితం ఘనీభవించాయట. ఈ వాటర్ కు కెనడా కు చెందిన “ఆక్వా డెకో” ఉత్తమ నాన్ కార్బోనేటేడ్ స్ప్రింగ్ వాటర్ గా పేర్కొంది.
#5 ఎవియన్ :
ఎవియన్ కంపెనీ నీరు కూడా చాలా స్వచ్ఛమైనది. శరీరం లో రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. 1789 వ సంవత్సరం లోనే మార్కిస్ అనే వ్యక్తి రోజు వాకింగ్ కి వెళ్లేవాడట. అలా వెళ్తూ, ఎవియన్ లెస్ బెయిన్స్ వద్ద ఉండే నీటిబుడగల్లోని నీటిని తాగేవాడట. క్రమం గా అతనికి ఉన్న కిడ్నీ, లివర్ సమస్యలు తగ్గిపోయాయని రుజువైంది. ఈ సంగతి అందరికి ప్రచారం అవడం తో, క్రమం గా ఆ నీటిని అమ్మడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నీరే ఎవియన్ బ్రాండ్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంది. చాలామంది సెలెబ్రిటీలు ఈ నీటిని ప్రత్యేకించి తెప్పించుకుని తాగుతారు. భారత్ లో కూడా ఆన్ లైన్ అమ్మకాలు సాగుతున్నాయి.
#6 లాక్వెన్ మినరల్ వాటర్:
ఇవికూడా భూమి అడుగుల్లోంచి తవ్వి తీయబడ్డాయి. దక్షిణ అమెరికా లో, ఆండెస్ పర్వతాల సమీపం లో ఎలాంటి జనసంచారం లేని,కాలుష్య రహిత ప్రాంతం లో పదిహేనొందల అడుగుల లోపలికి తవ్వి నీటిని వెలికితీశారు. ఈ నీరు బాటిల్ లో నింపేవరకు గాలి కూడా తగలనంత స్వచ్ఛం గా ఉంటాయట.
End of Article