టూవీలర్/ త్రీవీలర్/ ఫోర్ వీలర్.. ఇలా వెహికల్ ఏదైనా టైర్ మాత్రం నల్లగానే ఉంటుంది.. ఎందుకో తెలుసా..?

టూవీలర్/ త్రీవీలర్/ ఫోర్ వీలర్.. ఇలా వెహికల్ ఏదైనా టైర్ మాత్రం నల్లగానే ఉంటుంది.. ఎందుకో తెలుసా..?

by Anudeep

Ads

బైక్ లు, కార్ లు, లారీ లు, బస్సు లు.. ఇలా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ అన్నిటిలోను ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే.. వాటి టైర్ నల్లగా ఉండడం. ఇలా టైర్లు నల్లగానే ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా..? మనలో చాలా మంది అనుకునేది ఏమిటంటే.. వెహికల్స్ ఎక్కడబడితే అక్కడ తిరిగితే మాసిపోతాయి కాబట్టి నల్ల రంగులోనే ఉంటె మంచిది కదా అని అనుకుంటాం.. కానీ, టైర్లు మొదట్లో నల్ల గా ఉండేవి కాదట.

Video Advertisement

car tyre

1895 లో టైర్లను కనుక్కున్నప్పుడు.. ఇవి తెలుపు రంగులో ఉండేవట. అయితే, టైర్లను ఎక్కువ కాలం మన్నేలా చేయడం కోసం, మరియు వాటి దృఢత్వాన్ని మరింత గా పెంచడం కోసం వాటిని నల్లగా రూపొందించాలని భావించారట. టైర్లను తయారు చేసేటపుడు వాటికి కార్బన్ బ్లాక్ కాంపౌండ్ ను ఉపయోగించి తయారు చేస్తారట. ఈ క్రమం లో అవి నల్లగా మారుతాయి.

tyres 2

ఇలా టైర్ల తయారీలో కార్బన్ బ్లాక్ కాంపౌండ్ ను ఉపయోగించడం వలన టైర్లు మరింత దృఢం గా ఉండి..టైర్ల తయారీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మనం ఎన్ని రకాల వాహనాలను వినియోగిస్తున్నామో చూస్తూనే ఉన్నాము కదా.. అంతే కాకుండా.. మనం వాహనాలను ఎక్కువసేపు నడిపినపుడు అవి ఎక్కువ వేడి ని రిలీజ్ చేస్తాయి. ఈ క్రమం లో టైర్లు పేలిపోయే అవకాశం ఉంటుంది.

tyres 3

అది టైర్లను కార్బన్ బ్లాక్ కాంపౌండ్ ను ఉపయోగించి తయారు చేయడం వలన అవి ఆ ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడగలుగుతాయి. ఈ రకమైన రబ్బరు UV కిరణాల నుండి కూడా రక్షణ ఇవ్వగలదట. అయితే, యూవీ కిరణాల వలన టైర్ పని తీరు కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది.

 


End of Article

You may also like