మీ చేతి మీద ఇలాంటి గుర్తు ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!

మీ చేతి మీద ఇలాంటి గుర్తు ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!

by kavitha

Ads

తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. రానున్న రోజుల్లో తాము ఏ స్థానంలో ఉంటాము? ఉద్యోగం,పెళ్లి, జీవితంలో స్థిరపడడం లాంటి విషయాల గురించి తెలుసు కోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

Video Advertisement

ఈ విషయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో చాలా రకాల పద్ధతులు  ఉన్నాయి. వాటిలో హస్త సాముద్రికము కూడా ఒకటి. హస్త సాముద్రికము అనగా అరచేతిలో ఉండే రేఖల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. ఈ హస్తసాముద్రికంను విశ్వసించేవారు చాలా మంది ఉంటారు. వారిలో సాధారణ పౌరులే కాకుండా ప్రముఖులు కూడా ఉన్నారు.
అరచేతిలో గీతాలు రకరకాలుగా ఉంటాయి. వీటితో పాటు గుర్తులు కూడా ఉంటాయి. అయితే అర చేతిలో రేఖ‌ల మ‌ధ్య ‘ఎక్స్’ (X) ఆకారంలో గుర్తు ఉంటే వారికి లైఫ్ లో తిరుగు ఉండ‌ద‌ంట‌. ఇలాంటి గుర్తు ప్రపంచం మొత్తంలో 5 శాతం మందికి మాత్రమే ఉంటుంద‌ట‌. అర‌చేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండడం వల్ల క‌లిగే ఫ‌లితాల గురించి ఇప్పుడు చూద్దాం..
అర చేతిలో ఎక్స్ గుర్తు ఉన్నవారు అత్యంత ప్ర‌తిభావంతులుగా ఉంటార‌ట‌. ఆ వ్యక్తి సక్సెస్ బాటలో న‌డ‌వ‌డ‌మే కాక  ఇత‌రుల‌ను కూడా ఆ మార్గంలో న‌డిపిస్తారట. ఈ గుర్తు క‌లిగిన వ్యక్తులు ప్ర‌పంచాన్ని కూడా జ‌యిస్తార‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ప్ర‌పంచాన్ని జ‌యించిన అలెగ్జాండ‌ర్ ది గ్రేట్ అర చేతిలో ఈ ఎక్స్ గుర్తు ఉండేద‌ట. అలాగే అలెగ్జాండ‌ర్ తన అరచేతి రేఖలను బలంగా నమ్మేవారంట. మాస్కోలో ఉండే హెచ్‌టీఐ యూనివ‌ర్సిటి సైంటిస్టులు చాలా మంది చేతి రేఖ‌ల పై ప‌రిశోధ‌న‌లు చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్ర‌హం లింక‌న్ కు, ర‌ష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు అర చేతిలో ఎక్స్ గుర్తు ఉండేద‌ని సైంటిస్టులు తెలియ‌జేశారు. పరిశోధనల ప్ర‌కారం రెండు అర చేతుల్లో ఎక్స్ గుర్తు ఉంటే వారు జీనియస్ అని, బ‌లవంతులుగా ఉండ‌డంతోపాటు ఇత‌ర వ్య‌క్తుల‌ను తేలికగా అంచ‌నా వేయ‌గ‌ల‌ర‌ట‌. అలాగే వీరిని మోసం చేయ‌డం చాలా క‌ష్ట‌ం. ఎక్స్ గుర్తు ఉన్నవారు శారీర‌కంగా, మాన‌సికంగా శ‌క్తివంతులుగా ఉంటార‌ట‌. ఈ వ్యక్తులు పేరు ప్ర‌తిష్ట‌లు, స‌మాజంలో చాలా గౌర‌వం ఉంటుంద‌ని సదరు ప‌రిశోధకులు చెబుతున్నారు.

Also Read: చేతిలో ఉండే రేఖలు మారతాయా..? ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఒకవేళ మారితే.. దాని అర్ధమేంటి..?


End of Article

You may also like