మనం పుట్టినపుడు మన చేతి ని ముడుచుకుని ఉంటాయి.. దానివలన మన చేతి పై రేఖలు ఏర్పడతాయి. ఈ రేఖలు ఎప్పటికీ అలానే ఉంటాయా..? అంటే ఉండవు. ఇవి వయసు పెరిగే కొద్దీ ముదురుతూ ఉంటాయి. గీతలలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ గీతలను బట్టే హస్త సాముద్రికం చెబుతారని మనందరికీ తెలుసు. ఈ గీతలు మారినప్పుడల్లా రాత మారుతుందా..? అన్న సందేహం వస్తుంది కదా.

palmistr

కానీ.. అలా ఉండదు. మన రాతని బట్టే ఈ గీతలు కూడా మారుతూ ఉంటాయి. వాటిని చూసే వ్యక్తి యొక్క పరిస్థితులను చెప్పగలుగుతారు. మనందరికీ చిన్నప్పుడు చేతి రేఖలు ఎలా ఉన్నాయో.. మనం పెరిగిన తరువాత కూడా అలానే ఉండడం అంటూ జరగదు. రేఖలు ముదరడం తో పాటు.. కొద్దిపాటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. కర్మానుసారేణ బుద్ధి అన్నట్లే.. రాతకి తగ్గట్లే గీతలుంటాయి.