మీ అరచేతి మీద “ట్రయాంగిల్” సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!

మీ అరచేతి మీద “ట్రయాంగిల్” సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!

by kavitha

Ads

సాధారణంగా అరచేతుల పై గీతలు లేదా రేఖలు మాత్రమే కాకుండా చాలా రకాల గుర్తులు కూడా ఉంటాయి. ఈ గుర్తులు ఒక్కోటి ఒక్కో విషయాన్ని చెబుతాయని నిపుణులు చెబుతున్నారు. కొందరి అరచేతిపై త్రిభుజం గుర్తు కనిపిస్తుంది. హస్తసాముద్రిక శాస్త్రంలో త్రిభుజం గుర్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది.

Video Advertisement

అరచేతి పై త్రిభుజం గుర్తు వేర్వేరు ప్రదేశాల్లో ఉండటం వేరు వేరు విషయాలను సూచిస్తుంది. కొందరి చేతుల్లో మాత్రమే ఉండే ధన త్రిభుజము లేదా లక్కీ ట్రై యాంగిల్ అంటే ఏమిటో? అది అరచేతి పై ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఈ జ్యోతిష్యం అనేక విధాలుగా చెబుతారు. అందులో హస్త సాముద్రిక శాస్త్రం కూడా ఒకటి. ఈ  త్రిభుజం అనేది అరచేతిలోని ఆయువు రేఖ, బుద్ధి రేఖ, ధనరేఖల కలయికతో ఏర్పడుతుంది. దీనినే ధన త్రిభుజం లేదా లక్కీ ట్రై యాంగిల్ అని పిలుస్తారు. ఈ ట్రై యాంగిల్ ఎవరి చేతిలో ఉంటుందో వారికి దీర్ఘాయువు కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది.
వీరు గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేస్తున్నట్లు అయితే వీరికి ప్రమోషన్స్ త్వరగా వచ్చి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. లేదా వీరు వ్యాపారం కానీ చేస్తున్నట్లయితే అందులో మంచి లాభాలను గడించి, త్వరగా కోటీశ్వరులు కావడం జరుగుతుంది. ఇలాంటి త్రిభుజం అరచేతిలో ఉన్న వారు తప్పనిసరిగా కోటీశ్వరులు అవుతారని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా వీరు ఎటువంటి పని చేసినా కూడా ఎక్కువ కష్టం లేకుండా తేలికగా ఆ పనులలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగే వీరికి కోటీశ్వరులు అయ్యే యోగం మరియు అష్ట ఐశ్వర్య యోగం అనేవి కలుగుతాయని హస్తసాముద్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

Also Read: భారతదేశపు మొట్టమొదటి ఇంగ్లీష్ న్యూస్ రీడర్ “గీతాంజలి అయ్యర్” గురించి తెలుసా..?? ఆమె కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..??


End of Article

You may also like