భారతదేశపు మొట్టమొదటి ఇంగ్లీష్ న్యూస్ రీడర్ “గీతాంజలి అయ్యర్” గురించి తెలుసా..?? ఆమె కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..??

భారతదేశపు మొట్టమొదటి ఇంగ్లీష్ న్యూస్ రీడర్ “గీతాంజలి అయ్యర్” గురించి తెలుసా..?? ఆమె కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..??

by Anudeep

Ads

దూరదర్శన్.. మనకి తెల్సిన మొట్టమొదటి న్యూస్ ఛానల్. ఎన్ని బులెటిన్స్ వచ్చినా ఈ న్యూస్ కి ఉన్న క్రేజ్ వేరు. అయితే ఈ ఛానల్ లో ఇంగ్లీష్ న్యూస్ చదివేవారు గీతాంజలి అయ్యర్. అప్పట్లో ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ఆమె గొంతే వినిపించేది. 30 ఏళ్ళు దూరదర్శన్ న్యూస్ రీడర్ గా పని చేసిన ఆమె తాజాగా మరణించారు.

Video Advertisement

ఆమె కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం వాకింగ్‌కు వెళ్లి వచ్చిన తరువాత ఆమె కుప్పకూలిపోయారని, ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కోల్‌కతాలోని లోరెటో కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గీతాంజలి అయ్యర్, 1971లో దూరదర్శన్‌లో చేరారు. ఈమె నాలుగు సార్లు బెస్ట్ యాంకర్ అవార్డు అందుకున్నారు. 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు కూడా గెలుచుకున్నారు.

did you know the first english news woman of india..!!

జర్నలిజం చదువుకున్న గీతాంజలి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి డిప్లొమా కూడా అందుకున్నారు. అయ్యర్ వంటి వార్తా సమర్పకులు 1970ల మధ్యలో దేశవ్యాప్తంగా చాలా ప్రభావం చూపారు. దీనికి ముందు దూరదర్శన్ చిత్రహార్ మరియు కృషి దర్శన్ వంటి కార్యక్రమాలను మాత్రమే అందించింది. గీతాంజలి ఆ తర్వాత ఖాండాన్ అనే టీవీ సిరీస్‌లో కూడా నటించింది. కొన్ని ప్రకటనల్లో కూడా ఆమె నటించింది.

did you know the first english news woman of india..!!

2002 లో దూరదర్శన్ లో మానేసిన తర్వాత అయ్యర్ యష్ బిర్లా గ్రూప్‌లో పబ్లిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసారు . 2005లో, ఆమె అంతర్జాతీయ సేల్స్ డైరెక్టర్‌గా ఒబెరాయ్ గ్రూప్‌కి మారారు. ఆమె కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సలహాదారుగా కూడా ఉన్నారు. ఆమె ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ ప్రెస్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విభాగానికి డిప్యూటి హెడ్‌గా కూడా మూడేళ్లపాటు పనిచేశారు.

did you know the first english news woman of india..!!

ఆమె మృతికి ప్రముఖ రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పల్లవి శేఖర్. ఈమె కుమార్తె పల్లవి రచయితగా స్థిరపడ్డారు. ఈమె ప్రస్తుతం స్పెయిన్ లో నివసిస్తున్నారు.

Also read: “జూనియర్ ఎన్టీఆర్” లాగానే… తమ “ఇంగ్లీష్” యాక్సెంట్ వల్ల ట్రోలింగ్‌కి గురైన 7 నటులు..!


End of Article

You may also like