వాటర్ బాటిల్స్ పై ఈ లైన్స్ ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఇంత కారణం ఉందా?

వాటర్ బాటిల్స్ పై ఈ లైన్స్ ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఇంత కారణం ఉందా?

by Anudeep

Ads

మనిషి బతకడానికి ముఖ్యంగా కావలసింది గాలి, నీరు, ఆహారం. గాలి తర్వాత జీవకోటికి అత్యంత అవసరమైన ప్రకృతి వనరు నీరు. మీరు లేనిదే జీవనం ముందుకు సాగదు. పంచభూతాలలో ప్రధానమైనది నీరు. ఆహారం తినకుండా వారం రోజులైనా బతకగలంఏమోగానీ, ఒక్క నీటి చుక్క తాగకుండా గంట కూడా ఉండలేము.

Video Advertisement

మనిషి ప్రతి నిత్యావసరాలకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో నీరు కలుషితమైపోతుంది. ప్రకృతి నుంచి లభించే ఈ నీరు నేరుగా తాగడానికి భయం వేసి, మినరల్ బాటిల్స్ రూపంలో కొనుక్కుని మన దాహార్తిని తీర్చుకుంటాం.

ఇంతకీ విషయం ఏంటంటే మనం ఏదో ఒక టైంలో వాటర్ బాటిల్ ను కొనుక్కొని నీటిని తాగుతూ ఉంటాము. మనం ప్రయాణం చేసే సమయాలలోను, బయటికి వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ లోను,  బస్టాండ్ లోనో వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతుంటాము.

అయితే మనం తాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ని ఎప్పుడైనా గమనించారా.. ఒక్కొక్క కంపెనీ బాటలు ఒక్కో విధంగా లైన్లు ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు ఆ విధంగా లైన్లు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..

#1.

మొదటి విషయం ఏంటంటే ఇలా లైన్స్ వేయడం వలన  వాళ్ళ ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ని పెంచుకుంటారు.  అంటే ఇలా బాటిల్ పై లైన్స్ డిజైన్ చేయడం వల్ల ఆ  బాటిల్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీనివలన బాటిల్స్ అనేవి ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఇందువలన బాటిల్ తయారు చేసే కంపెనీ వాళ్ళు ఆ బాటిల్ పైన లైన్స్ ని డిజైన్ చేస్తూ ఉంటారు.

#2.

ఇక రెండో విషయం ఏంటంటే నీరు త్రాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్ అనేవి చాలా పలచగా తయారు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ప్లాస్టిక్ బాటిల్ పైన లైన్స్ కనుక లేకపోతే, ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేవి ఎక్కడైన నీటి ప్రదేశం పడివేసినప్పుడు నీటిలో మునిగి పోయే అవకాశం ఉంటుంది.

దీనివలన వాటర్ పొల్యూషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలనే తయారు చేసే కంపెనీ వారు బాటిల్స్ నీటిలో మునగకుండా బాటిల్స్ పైన  లైను డిజైన్ చేస్తారు.

#3.

ఇంకా మూడవ ముఖ్య విషయం ఏమిటంటే మనం బాటిల్ ను పట్టుకోవడానికి అనువుగా ఉండటానికి ఈ లైన్స్ అనేవి ఫిక్స్ చేస్తారు.


End of Article

You may also like