అలవాట్లు ఒక్కో దేశం లోను ఒక్కోలా ఉంటాయి. అవి ఆ దేశ పరిస్థితులను బట్టి.. ఆ దేశ ప్రజల అవసరాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. సామాన్యం గా మన దేశం లో బహిరంగ మలమూత్ర విసర్జన తప్పు. పబ్లిక్ టాయిలెట్స్ ను ఉపయోగించకుండా.. రోడ్డు పైనే మలమూత్ర విసర్జన చేయడం తప్పుకిందకే వస్తుంది. పిల్లలైనా సరే పబ్లిక్ టాయిలెట్స్ నే ఉపయోగించాలి.

china kids 2

కానీ, చైనా లో మాత్రం పిల్లలకు ఎక్కడైనా మలమూత్ర విసర్జన చేసే అవకాశం ఉంటుందట. ఈ విషయం గురించి ఓ కోరా యూజర్ ఈ విధం గా తెలిపాడు. అతను బిజినెస్ పని మీద చైనా కు వెళ్ళినపుడు.. అక్కడ ఓ మహిళ రోడ్డు పై ఓ పక్క గా తన కిడ్ చేత మలమూత్ర విసర్జన చేయిస్తోంది. ఆమెను చూడబోతే.. పైనుంచి కింది వరకు ఫుల్ గా బ్రాండెడ్ దుస్తులనే ధరించింది. చూస్తే, నాగరిక మహిళ లాగా కనిపిస్తున్నప్పటికీ.. ఆమె తన కిడ్ తో ఇలా చేయించడం తో సదరు వ్యక్తి ఆశ్చర్య పోయాడట.

china urinate 1

సామాన్యం గా చాలా దేశాలలో మహిళలు తమ పిల్లల కోసం డైపర్లను వినియోగిస్తారు. ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వారు ఇలా చేస్తూ ఉంటారు. అయితే, చైనా లో మాత్రం బహిరంగ మల మూత్ర విసర్జన అనేది పిల్లలకు హక్కు కింద వస్తుందట. ఎవరైనా తమ పిల్లలచే ఎక్కడైనా విసర్జన చేయించుకోవడానికి అనుమతులు ఉంటాయట.

chinese kids 2

అక్కడి పబ్లిక్ టాయిలెట్స్ అంత పరిశుభ్రం గా ఉండవని, క్రిములు ఎక్కువ గా ఉండే అవకాశం ఉండడం వల్లనే పిల్లలకు ఇలాంటి వెసులుబాటు కల్పించి ఉంటారని మరో కోరా యూజర్ కామెంట్ చేసారు. కొన్ని కొన్ని అలవాట్లు పరిస్థితులను బట్టి ఏర్పడతాయని ఇందుకే అంటారేమో మరి.