అమ్మాయిల విషయం అబ్బాయిలు ఎలా ఆలోచించాలో తెలుసా..? అమ్మాయిల గురించి చాణుక్యుడు ఏమని చెప్పాడంటే..?

అమ్మాయిల విషయం అబ్బాయిలు ఎలా ఆలోచించాలో తెలుసా..? అమ్మాయిల గురించి చాణుక్యుడు ఏమని చెప్పాడంటే..?

by Anudeep

Ads

చాణుక్యుని గురించి తెలియని వారు ఉండరు. సామజిక జీవితం లో మనిషి మనుగడ సాగించడానికి ఆయన చెప్పిన నీతి వాక్యాలు ఎంతగానో అవసరం అవుతాయి. జీవితం లో ఒక్కసారి అయినా ఆయన ఏమి చెప్పారో అన్న విషయాన్నీ గుర్తు చేసుకోకుండా మనం ఉండలేము. అలాగే.. ఆయన అమ్మాయిల గురించి ఏమి చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

chanakya 2

స్వార్ధం, అసూయా, కఠినత్వం, మూర్ఖత్వం, అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలు ఎక్కువ స్త్రీలలో ఉంటాయట. ఈ లక్షణాల వలనే స్త్రీలు జీవితం లో వెనకబడిపోతారట. అలాగే.. స్త్రీలు ఏ పని చేయాలన్న భర్త అనుమతి తీసుకోవాలట. అలా చేయకుంటే.. భర్త కంటే ముందు ఆమెకు మరణం సంభవిస్తుంది. పైలోకం లో ఆమె కు ఎక్కువ శిక్షలు పడతాయట. అలాగే.. అబ్బాయిలు పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి కుటుంబ వాతావరణం చూడాలట. అమ్మాయి అందం గా లేకున్నా, మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఐతే జీవితం బాగుంటుందట.

girls 1

అదే అమ్మాయి అందం గా ఉండి.. మంచి కుటుంబం కాకపోతే జీవితం నరకప్రాయమవుతుందట. పుల్లని పదార్ధాలు ఎలా రాగి పాత్రలను శుభ్రం చేస్తాయో.. అలాగే.. రుతుక్రమం అమ్మాయిలను శుభ్రపరుస్తుందట. స్త్రీ మనస్సుని అసలెప్పటికీ అర్ధం చేసుకోలేమట. స్త్రీ, రాజు, మత గురువులతో ఎప్పటికి చనువు గా ఉండరాదని, అది మంచిది కాదని చాణుక్యుడు తెలిపారు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే స్త్రీలతో ప్రశాంతం గా, మర్యాద గా ప్రవర్తించాలట. వారు కోపం చూపినా, చిరునవ్వు తో మాట్లాడితే వారే మీ దారిలోకి వచ్చేస్తారట.

girls 2

అలాగే మూర్ఖం గా మాట్లాడే స్త్రీలని పొగడ్తలతో ముంచెత్తి దారిలోకి తెచ్చుకోవాలట. తెలివి గల అమ్మాయిల దగ్గర అబద్ధాలు చెప్పకూడదట. నిజాయితీ గా ఉన్నపుడే వారికి మీ పై ఆసక్తి కలిగి మీ దారిలోకి వస్తారట. స్వార్థం, అత్యాశ కలిగిన అమ్మాయిలకు ఏదైనా లాభం లేక ధనం ఆశ చూపి దారిలోకి తెచ్చుకోవచ్చట.


End of Article

You may also like