Ads
మన భారతదేశంలో బంగారాన్ని ఇష్టపడేవారికి కొదవేలేదు. ధన త్రయోదశి, మార్గశిరమాసం అంటూ, వివాహం, పుట్టినరోజు అంటూ అనేక సందర్భాలతో బంగారం కొంటూనే ఉంటారు మన భారతీయులు.
Video Advertisement
నిరుపేద నుంచి కోట్లకు పడగలెత్తిన వాడు కూడా బంగారం అంటే మక్కువ చూపిస్తుంటారు. ఇలా రోజురోజుకు బంగారం విలువ కొండెక్కి కూర్చుంటుంది. కొందరు అదే పనిగా ఎక్కువ బంగారం కొంటుంటారు. అవసరానికి మించి ఆభరణాలు ధరిస్తుంటారు.
అయితే మన దేశంలో ఒక్కొక్క వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండాలనేది చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. పరిమితికి మించి బంగారం కలిగి ఉండడం వల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో ఇప్పటికే బంగారం పరిమితి నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు. అందువల్ల బంగారానికి సంబంధించి ఇంత మాత్రమే ఉండాలని ఎటువంటి నియమాలు లేవు. ఒక సర్వే ప్రకారం సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్ బంగారం పై ఒక వ్యక్తి దగ్గర ఎంత ఉండాలి అనే పరిమితిని తీసుకువచ్చింది.
ఈ రూల్స్ ప్రకారం కుటుంబంలోని ప్రతి ఒక పురుషుడు వద్ద 100 గ్రాముల వరకు బంగారాన్ని వాళ్లతో ఉంచుకోవచ్చు. అదేవిధంగా పెళ్లి అయినా స్త్రీ అయితే 500 గ్రాముల, పెళ్లి కాని వాళ్ళు 250 గ్రాముల బంగారు ఆభరణాలు కలిగి ఉండవచ్చని నిర్ణయించింది. ఈ CBDT రూల్స్ ప్రకారం పరిమితిని మించి బంగారం ఉండకూడదా అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది. ప్రతి వ్యక్తి ఇచ్చిన పరిమితి కన్నా ఎక్కువ బంగారం కలిగి ఉండవచ్చు. ఇది బంగారం పై గల ఈ పరిమితి ఆదాయ పన్ను లెక్కింపు కోసం మాత్రమే.
పరిమితికి మించిన బంగారం ఉంటే దానికి సంబంధించిన రసీదులు వంటివి జాగ్రత్త చేసుకోవాలి. ఒకవేళ ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగినప్పుడు బంగార అభరణాలకు సంబంధించిన రసీదులు చూపించటం వలన వాటిని జప్తు చేయకుండ వదిలేస్తారు. అదేవిధంగా కొందరికి తాత ముత్తాతల నుంచి కానుకగా మరియు బంగారు ఆభరణాలు సంక్రమిస్తాయి. ఇలాంటి వారు సరైన సాక్షాలతో కూడిన వీలునామాను చూపటం ద్వారా మీ బంగారాన్ని జప్తు చేయలేరు. ఇలా సరైన ఆధారాలను చూపటం ద్వారా మన బంగారం గురించి భయపడాల్సిన అవసరం లేదు.
End of Article