“మైసూర్ పాక్” కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? “మైసూర్ ప్యాలస్” తో ఏమైనా సంబంధం ఉందా..?

“మైసూర్ పాక్” కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? “మైసూర్ ప్యాలస్” తో ఏమైనా సంబంధం ఉందా..?

by kavitha

Ads

స్వీట్స్ ని ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ఎన్ని రకాల మిఠాయిలు ఉన్నప్పటికి కూడా మైసూర్ పాక్ ది ఎప్పుడు ప్రత్యేకమైన స్థానమే. పండుగల సమయంలో, శుభకార్యాలలో, ఏదైనా శుభవార్తను పంచుకోవడానికి మైసూర్ పాక్ ఉండాల్సిందే. ఇప్పటికి రాఖీ పండుగ సమయంలో పల్లెటూర్లలో ఉపయోగించే స్వీట్స్ లో మొదటి స్థానం మైసూర్ పాక్ దే అని చెప్పవచ్చు. మరి ఈ స్వీట్ కి మైసూర్ పాక్ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

మైసూర్ పాక్ కు దేశవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు ఉంది. దక్షిణ భారతీయ సాంప్రదాయ తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని రాయల్ స్వీట్ అని కూడా అంటారు. మైసూర్ మహారాజా నాలుగవ వడయార్ అయిన కృష్ణరాజ (1884-1940) భోజన ప్రియుడు. మైసూర్‌లోని ఎంతో ప్రసిద్ధ అంబా విలాస్ లో రకరకాల వంటకాలను తయారుచేయడానికి పెద్ద వంటగదిని ఏర్పాటుచేశారు. ఆ కాలంలో ప్రధాన చెఫ్ గా ఉన్న కాకాసుర మాదప్ప వంటకాలు చేయడంలో తిరుగులేనివాడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన యూరోపియన్ వంటకాల నుండి ప్రసాదం వరకు అన్ని రకాల వంటలు చేయడంలో ఆరితేరినవాడు. ఇక మిఠాయిలు తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
ఆయన వంటలలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఎన్నో అద్బుతమైన వంటకాలను తయారుచేసేవాడు. అలా ఆయన తయారు చేసిన తీపి వంటకమే మైసూర్ పాక్. ఈ మిఠాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆయనను నలపాక అని పిలిచేవారు.దాంతో ఆయన పేరులోని పాక, మైసూర్ ప్యాలెస్ లో తయారుచేశారు కాబట్టి రెండు కలిపి మైసూర్ పాక్ అని పెట్టారు.ఆ పేరు అలాగే ప్రసిద్ధి చెందింది.అప్పటి మైసూర్ పాలకుడు నాలుగవ కృష్ణ రాజ వొడెయార్ మైసూర్ ప్యాలెస్ కు వచ్చే గెస్ట్ ల కోసం మైసూర్ ప్యాలెస్ లో దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించేవారని చెబుతారు.
రాజుకు ఈ స్వీట్ అంటే ఎంతో ఇష్టం. దాంతో ఆయన దాని రుచిని ఆ రాజ్య ప్రజలకు కూడా రుచి చూడాలని భావించాడు. అందుకే ప్రధాన చెఫ్ మాదప్పను ప్యాలెస్ ప్రాంగణం బయట ఒక స్వీట్ షాప్ ను తెరవమని చెప్పడంట. అయితే మాదప్ప కూడా తను తయారుచేసిన మైసూర్ పాక్ రుచిని సాధారణ ప్రజలకు కూడా రుచి చూపించాలని కోరుకున్నాడు, అలా అశోకా రోడ్డులో దేశికేంద్ర స్వీట్ మార్ట్‌ను అనేదానిని ప్రారంభించాడని తెలుస్తోంది. ఆ షాప్ ఆ తరువాతఈ కాలంలో ‘గురు స్వీట్ మార్ట్’కి మారి సయ్యాజీ రావు రోడ్ కి మార్చబడింది.అత్యుత్తమ మైసూర్ పాక్‌ను రుచి కోసం అయితే సయాజీ రావు రోడ్‌లోని గురు స్వీట్ మార్ట్ కి వెళ్ళాల్సిందే. మాదప్ప వారసులు ఈ షాప్ కి యజమానులుగా ఉన్నారు. ఈ గురు స్వీట్ మార్ట్ సుమారు 85 సంవత్సరాలుగా అసలైన వంటకాన్ని వారసత్వంగా పొందిన అన్నదమ్ములు నటరాజ్, కుమార్, శివానంద్ నడుపుతున్నారు. ఈ దుకాణంకు రోజుకు 1000కి పైన కస్టమర్లు వస్తారని సమాచారం. అందులో 40 శాతం మంది పర్యాటకులే.
Also Read: విమర్శకులకు RRR సినిమా ఒక గుణపాఠం… చరణ్ కష్టం ఫలించింది..!


End of Article

You may also like