మనం ప్రస్తుతం జీవిస్తున్న యుగం కలియుగం. హిందూ పురాణాల ప్రకారం భూమి అంతరించేది కలియుగంలోనే అనేది వెల్లడవుతుంది. కలియుగాంతం సమయంలో మనుషుల ప్రవర్తన, ఆలోచన తీరు, చేసే పనులు చాలా అసహ్యంగా, చెడు కార్యాలను ఎక్కువగా మగ్గు చూపుతారని మన పురాణాలు వర్ణిస్తున్నాయి.

Video Advertisement

మన హిందూ పురాణాల ప్రకారం యుగాలు నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. భగవద్గీత ప్రకారం సత్యయుగంలో మనుషులు ఎలాంటి తప్పులు చేయకుండా నీతిపరులుగా ఉంటారు.

త్రేతాయుగంలో కొంత కాలానికి డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో వంచన, వ్యతిరేక భావం వంటి చెడు పనులు చేస్తారు. అదేవిధంగా ద్వాపరయుగానికి  వచ్చేసరికి మనుషులలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. పూర్తిగా చెడు పనులకు అలవాటు పడిపోతారు. కలియుగంలోకి వచ్చేసరికి ఉన్నత స్థానానికి చేరటానికి రకరకాల అడ్డదారులు తొక్కుతూ అనేక పాపాలు చేస్తూ ఉంటారు. జ్ఞానమనేది కలియుగంలో తగ్గిపోతుంది. వయసు, కులము అనే తారతమ్యాలు లేకుండా మారిపోతుంది.

అసలు కలియుగం అనేది ఎలా అంతమవుతుంది. ఎవరి చేతుల్లో అంతమవుతుంది. మనుషులు కలియుగాంతంలో చనిపోయేముందు మనుషులు ఏమి గుర్తిస్తారు. కలియుగాంతం తర్వాత మరో ప్రపంచం ఉద్భవిస్తుదా.. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.

భగవద్గీత ప్రకారం కలియుగం అనేది ఒక వ్యక్తి అవతారం చేతిలో అంతరిస్తుంది. ఎవరు ఎలా అంటే.. విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తి కలియుగానికి అంతం చేస్తాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కలియుగాంతానికి ముందు మనుషులు కేవలం చేపలను మాత్రమే తింటారు. గొర్రె మేక పాలు మాత్రమే తాగుతారు. ఎందుకంటే ఈ భగవద్గీత ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు భూమి మీద ఆవులు అనేవి ఉండవట.

అంతేకాకుండా మనుషులకు ఒకరిపై ఒకరికి  జాలి, దయా  అనేది ఉండదట. ఎంతో ఓర్పు, సహనానికి  మారుపేరైన మహిళలు కూడా వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు. మహిళలు ఎంతో అసభ్యకరమైన మాట తీరును ఉచ్ఛరిస్తారు. వ్యభిచారం వంటి అకృత్యాలు విపరీతంగా పెరిగిపోతాయి. కలియుగాంతానికి ముందు మనిషి జీవిత కాలం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ బతకలేరు. మహిళలు కేవలం ఎనిమిది సంవత్సరాల వయసులోనే మరో బిడ్డకు జన్మనిచ్చారు.

ఆలయాల అనేవి పూర్తిగా అంతరించిపోతాయి. సూర్య చంద్ర గ్రహణాలు కూడా ఉండవు. భూమి మీద వేడి విపరీతంగా పెరిగిపోతుంది. గరుడ పురాణం ప్రకారం ఈ సమయంలోనే విష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ చెందిన “శంభల” అనే గ్రామంలో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు.

కలియుగం లో జన్మించిన కల్కి ఎంతో ధైర్యం, తెలివి మహా శక్తివంతుడుగా ఉంటాడు. తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ తెల్లని రూపంతో  వీర ఖడ్గం ధరించి దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి మరలా తిరిగి భూమిపై సత్య యుగాన్ని స్థాపిస్తాడు కల్కి అని గరుడ పురాణం చెబుతోంది.  ఎప్పుడైతే పాపాలు మహా రూపం దాల్చుతాయో కల్కి జన్మించడం జరుగుతుంది.