Ads
మనలో చాలా మందికి గుడ్లగూబ అంటే భయం, ఒక అయిష్టత. రకరకాల ప్రచారాల వల్లనే మనలో చాల మందికి గుడ్లగూబ అంటే ఒక ఏహ్యభావం కలుగుతోంది. కానీ, హిందూ శాస్త్ర ప్రకారం గుడ్లగూబ శుభ శకునానికి సూచన అట. అదెలానో మనం ఈ ఆర్టికల్ లో చూసేద్దాం..
Video Advertisement
గుడ్లగూబ అందవికారం గా ఉంటుంది. కళ్ళు చాలా పెద్దవి గా ఉండడం తో చూడగానే భయం వేసే విధం గా ఉంటుంది. అంతే కాదు దాని గొంతు కూడా కర్ణకఠోరం గా ఉంటుంది. అందుకే సహజం గా గుడ్లగూబని చూడగానే భయం కలగడం సహజం. ప్రస్తుత కాలం లో గుడ్లగూబలు అంతరించిపోతున్నాయి. గుడ్లగూబలు చూడడానికి కానీ, పెంచుకోవడానికి కానీ మనలో చాలా మంది ఇష్టపడరు. కానీ, రైతులకు మాత్రం ఇవి మంచి స్నేహితులు.
మనలో చాలా మందికి ఉన్న నమ్మకం ఏమిటంటే, గుడ్లగూబను చూస్తే చెడు జరుగుతుంది అని, గుడ్ల గూబ ఇంట్లో కి వస్తే ఆ ఇల్లు విడిచేయాలని, లేకుంటే చావు వార్త వినాల్సి వస్తుందని..ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అందుకే మనలో చాలా మంది అదొక భయంకరమైన పక్షి లా భావిస్తూ ఉంటారు. అయితే, హిందూ శాస్త్రాలు గుడ్లగూబను లక్ష్మి దేవి వాహనం గా కీర్తిస్తున్నాయి. లక్ష్మి అమ్మవారు స్వామి వారితో పాటు గరుడ వాహనం పైన, ఒంటరిగా వెళ్ళవలసి వస్తే గుడ్లగూబ పైన ప్రయాణిస్తుందట.
అలాగే, ఉల్లూక తంత్రం ప్రకారం నాలుగవ జాము సమయం లో గుడ్ల గూబ ఎవరి ఇంటిపైన అయినా వాలితే, వారి ఇంట్లో కనకవర్షం కురుస్తుందట. ఎవరైనా ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ నివాసం ఏర్పరుచుకుంటే.. వారి ఇంట్లో యజమాని తో సహా కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో నివసిస్తారట.
End of Article