గ్యాస్ నొప్పి, గుండె నొప్పి కి తేడా ఏంటి.? ఏ సమయంలో జాగ్రత్త పడాలి.?

గ్యాస్ నొప్పి, గుండె నొప్పి కి తేడా ఏంటి.? ఏ సమయంలో జాగ్రత్త పడాలి.?

by Anudeep

Ads

ఒక్కోసారి గ్యాస్ నొప్పి వచ్చినా సరే హార్ట్ ఎటాక్ వచ్చిందేమో అని ఆందోళన చెందుతూ ఉంటాం. అదేవిధంగా నిజంగా హార్ట్ ఎటాక్ వచ్చినా కూడా గ్యాస్ నొప్పి అనుకొని సింపుల్ గా తీసిపడేస్తూ ఉంటారు.

Video Advertisement

ఇలా చేయడం ద్వారా ప్రాణాలు పోయే ముప్పు  వాటిల్లుతుంది. గుండె నొప్పి, గ్యాస్ ట్రబుల్ కి తేడా ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి.

మన ప్రాణాన్ని భద్రంగా కాపాడుకోవాలి అంటే..  ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గ్యాస్ నొప్పి దీనినే మనం ఎసిడిటి అని అంటూ ఉంటాం. తిన్నది అరగక పోవడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, వికారం, తేన్పులు, దుర్వాసనతో కూడిన వాయు విడుదల చేయడం వంటివి మనం ఎసిడిటిగా పరిగణిస్తాం.

మనం ఆహారం తీసుకున్న తర్వాత సరిగ్గా జీర్ణమవడానికి మన ప్రేగులలో జీర్ణరసాలు తయారవుతూ ఉంటాయి. మోతాదుకు మించి జీర్ణరసాలు తయారైనప్పుడు ఇది మన ప్రేగుల పొరలు  తినడం మొదలు పెడుతుంది. ఈ జీర్ణరసాలు అధిక మోతాదులో తయారవడం వల్ల  గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ప్రేగులలో అల్సర్స్ కూడా ఏర్పడతాయి

గ్యాస్ సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మానసిక సమస్యల వలన, మసాలా పదార్థాలు ఎక్కువగా కోవడం వల్ల ఎసిడిటి సమస్య ఎదురవుతుంది.

కొంత మంది సరైన సమయానికి తిన్న కూడా గుండె దగ్గర గాని, పొట్టపై భాగంలో గాని నొప్పి వస్తుంది. దీన్ని రిఫలెక్ట్ డిసీజ్ అంటారు. రిఫలెక్ట్ డిసీజ్ అంటే మనం తిన్న ఆహారం పొట్టలోకి వెళ్ళిన తర్వాత మన అన్నవాహికలోకి ఆసిడ్డ్స్ వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉంటే వెనక్కు వస్తుంటాయి.

ఇలా ఆసిడ్ వెనక్కి రావడం వలన అన్నవాహిక అనేది మన గుండె వెనుక భాగంలో ఉంటుంది కాబట్టి మనకు ఛాతీలో నొప్పిని లేదా గుండెల్లో నొప్పిని కలుగజేస్తూన్నట్లు అనిపిస్తుంది.

ఎసిడిటి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి  ఆసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వలన, రెండవది ఆసిడ్స్ రిఫ్లెక్ట్ అవటం వలన పొట్టపై భాగంలో గాని , ఛాతి కింద భాగంలో గాని వచ్చే మంటను  ఎసిడిటీగా పరిగణిస్తారు.

ఎడమ చేయి నొప్పిగా ఉండడం, గుండె మీద ఎవరైనా గట్టిగా ఒత్తి నట్లు గాని, బాగా నొప్పిగా ఉన్నప్పుడు గాని,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం గాని ఉన్నట్లయితే దానిని గుండె నొప్పిగా పరిగణిస్తారు. ఈ విధమైన సూచనలను  గ్యాస్ ట్రబుల్ అన్నట్లు పరిగణిస్తే చాలావరకు ప్రాణానికి ముప్పు పొంచి ఉంటుంది.

ఈ గుండె నొప్పి అనేది ఎక్కువగా అధిక బరువు ఉన్న వారికి గాని , మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నవారికి గాని సంభవిస్తూ ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి  ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

సాధారణంగా అధిక బరువు ఉన్నవారు, షుగరు, బీపీ ఉన్నవారు ముఖ్యంగా డాక్టర్ను సంప్రదించి ఇది గుండె నొప్పి లేక గ్యాస్ నొప్పి అనే విషయాన్ని తెలుసుకొని తగిన సూచన తీసుకోవడం ఎంతో మంచిది..


End of Article

You may also like