RX 100 బైక్ వెనకున్న చరిత్ర మీకు తెలుసా..? సడన్ గా ఎందుకు బ్యాన్ చేసారంటే..?

RX 100 బైక్ వెనకున్న చరిత్ర మీకు తెలుసా..? సడన్ గా ఎందుకు బ్యాన్ చేసారంటే..?

by Sunku Sravan

Ads

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల బైకులు మనకు అందుబాటులోకి వచ్చాయి. రకరకాల డిజైన్లలో, వివిధ ఫీచర్లతో సరసమైన ధరలతో మనకు అందిస్తున్నాయి ఆయా కంపెనీలు.

Video Advertisement

ఎన్ని బైకులు వచ్చినా కానీ ఈ బైకుకు సాటి రాదంటారు యువత.. దీన్ని చాలా క్రేజీ గా భావిస్తూ రైడ్ చేయాలనుకుంటారు. మరి యూత్ అంతలా ఇష్టపడే ఆ మోటార్ వాహనం ఏంటో చూద్దామా..!

బైక్స్ అంటే ప్రస్తుతం మార్కెట్లో అనేకం ఉన్నాయి. ఇందులో ఎవరికి స్తోమత తగ్గట్టు వారు డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తారు. మనకు తెలిసిన వాటిలో గ్లామర్, హీరో, హోండా, సుజుకి, బజాజ్ ఇంకా అనేక కంపెనీల బైక్ లు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ ఆర్ఎక్స్ 100కు ఉండేటువంటి ప్రాధాన్యత మరి దీనికి లేదని చెప్పవచ్చు. మరి ఈ బైక్ ను ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది. కారణం ఏమిటి. యూత్ ఎందుకు అంతలా

ఇష్టపడతారు. ఆ బైక్ లో ఏముంది..? ఈ బైకుని అప్పటి కాలం నుంచి ఇప్పటివరకు ఎంతో ఇష్టపడతారు. ఈ బైక్ కోసం అప్పట్లోనే చాలామంది నాన్న డబ్బులు ఇవ్వలేదని ఇల్లు వదిలి వెళ్లిపోవడం, ఇంకొంతమంది ఎంతో కష్టపడి బైక్ కోసం డబ్బులు సంపాదించుకోవడం, కొన్ని సందర్భాల్లో ధర్నాలు, హత్యలు కూడా జరిగాయి ఈ బైక్ కోసం. ఇంతలా ఇష్టపడే ఈ వాహనాన్ని ఎందుకు బ్యాన్ చేశారనేది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం ఈ వాహనాలకు సెకండ్ హ్యాండ్ లో కూడా ఏ బైకుకు లేనంత

డిమాండు ఉంది. ఇంతలా దీని పిచ్చిలో పడి పోవడానికి కారణాలు చూసుకుంటే ముందుగా దీని బరువు, చాలా తక్కువగా ఉంటుంది. దాదాపుగా 100 నుంచి 105 కిలోల బరువు ఉంటుంది. అలాగే ఈ బైకు నడిపే వారు కానీ, కూర్చున్న వారికి కానీ నడుము నొప్పి లాంటి సమస్యలు వచ్చేవి కావట. ఇద్దరు కానీ ఒక్కరు కానీ వెళ్లడానికి ఎంతో బాగుంటుంది. దీని సీసీ 100 వల్ల 100 -105 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎంత

సామర్థ్యం దీని సొంతం. 100 సిసి బైక్ లో వేరే బైక్ ఇంత స్పీడ్ గా వెళ్లడం సాధ్యమయ్యేది కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి న్యూ మోడల్ బైక్స్ 100 దాటితే షేక్ అవుతాయి. కానీ ఆ కాలంలో ఈ బైకు ఈ స్పీడ్ లో వెళ్ళినా షేక్ అయ్యేది కాదు. ఈ యొక్క బైకు ఆ కాలంలో వన్ మాన్ ఆర్మీగా చెప్పుకునేవారు. దీన్ని యూత్ ఎక్కువగా ఇష్టపడడానికి ప్రధాన కారణం సైలెన్సర్ నుంచి వచ్చే బీటింగ్.

ఇన్ని మంచి కారణాలు ఉన్న యువకులు మంచి క్రేజ్ ఉన్న దీన్ని నిలిపివేయాలని ప్రధాన కారణం టూ స్ట్రోక్ ఇంజిన్. ఫోర్ స్ట్రోక్ ఇంజన్ మరియు టూ స్ట్రోక్ ఇంజన్ రెండిటిని పోలిస్తే టూ స్ట్రోక్ ఇంజన్ తో మాత్రమే స్పీడ్ గా వెళ్తాం. మరి ఎందుకు బ్యాన్ చేశారు. బండి స్పీడ్ గా వెళ్తుంది కానీ మైలేజ్ ఎక్కువగా రాదు. ఖర్చు ఎక్కువగా అవుతుంది కాబట్టి, అన్ని ఆటో మొబైల్ కంపెనీస్ టూ స్ట్రోక్ ని బ్యాన్ చేసి ఫోర్ స్ట్రోక్ గా మాడిఫై చేశారు.


End of Article

You may also like