ఐఫోన్ అసిస్టెంట్ ను “సిరి” అనే ఎందుకు పిలుస్తారు..? అసలు కారణం ఇదే..!

ఐఫోన్ అసిస్టెంట్ ను “సిరి” అనే ఎందుకు పిలుస్తారు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

ఫోన్లలో ఐఫోన్ రేంజ్ వేరు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఎందుకంటే ఐఫోన్ లో వచ్చే స్పెషల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లను హాక్ చేసినట్లు ఐఫోన్ లను హాక్ చేయడం అంత తేలిక కాదు.

Video Advertisement

iphone assistant 1

ఇక ఈ రెండు మొబైల్ ఫోన్లలో ఉండే కామన్ పాయింట్ ఏంటి అంటే “డిజిటల్ అసిస్టెంట్”. ఆండ్రాయిడ్ ఫోన్ లలో కూడా గూగుల్ డిజైన్ చేసిన అసిస్టెంట్ ఉంటుంది. ఈ అసిస్టెంట్ ను గూగుల్ అసిస్టెంట్ అనే పేర్కొంటాం తప్ప.. దీనికి ప్రత్యేకమైన పేరు ఏమి ఉండదు. కానీ, ఐఫోన్ లలో పని చేసే అసిస్టెంట్ ను మనం సిరి అని పిలుస్తుంటాం. హే సిరి అనగానే ఈ అసిస్టెంట్ రెస్పాండ్ అవుతుంది.

iphone assistant 2

అయితే.. ఈ అసిస్టెంట్ కు సిరి అని పెట్టడానికి కారణం ఏంటంటే.. ఈ ఫీచర్ ను శ్రీ ఇంటర్నేషనల్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సెంటర్ అనే సంస్థ వారు డిజైన్ చేసారు. అందుకే వారి పేరు మీదగా.. “సిరి” అని పెట్టారు. సిరి స్పీచ్ రికగ్నైజేషన్ ఇంజిన్ అనేది న్యూయన్స్ కమ్యూనికేషన్స్ వారు ప్రొవైడ్ చేసారు. 2011 లో ఓ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని వారే వెల్లడించారు.


End of Article

You may also like