రోల్స్ రాయిస్ కారును పూర్తిగా చేతితోనే తయారుచేస్తారు అంటే మీరు నమ్ముతారా..? దాని వెనుక రహస్యం ఏంటి..?

రోల్స్ రాయిస్ కారును పూర్తిగా చేతితోనే తయారుచేస్తారు అంటే మీరు నమ్ముతారా..? దాని వెనుక రహస్యం ఏంటి..?

by Sunku Sravan

Ads

ప్రస్తుత సమాజంలో కార్లు అనేవి చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఇందులో మధ్యతరగతి కుటుంబాలు చిన్నాచితకా కార్లను కొన్న, కానీ కొంత మంది సంపన్న కుటుంబాలు ఎంతో ఖరీదైన స్పెషల్ కార్లను కొనుగోలు చేస్తారు.

Video Advertisement

ఇందులో ఒకటి రోల్స్ రాయిస్ ఈ కార్లు చాలా ప్రత్యేకమైనవి. దీని తయారీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది అది ఏంటో ఒకసారి చూద్దాం..?

ఒక మారుతి కారు తయారు చేయడం కోసం పట్టే సమయం 12 గంటలు మాత్రమే. మారుతి కంపెనీ నుంచి 10 సెకండ్లకు ఒక కారు తయారై బయటికి వస్తుంది. ఆ విధంగా మారుతి తన మార్కెట్ నడిపిస్తుంది. కానీ రోల్స్ రాయిస్ కారు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే దాని తయారీ మొదలవుతుంది అనేది చాలా మందికి తెలియదు.

ఇది దాదాపుగా ఒక సంవత్సరంలో 4000 వేల నుంచి 5000 కార్లు మాత్రమే తయారుచేస్తారు. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం. ఇది బుక్ చేసిన తర్వాత ప్రత్యేకమైన ఎంపికలో ఆప్షన్లను బట్టి మూడు నెలల నుంచి సంవత్సర కాలం పట్టవచ్చు.. ఎందుకో ఒకసారి చూడండి..?

ఈ కారులో బాడీపై ఉండే లోహపు రేకులను తప్ప మిగతా భాగాలన్నీ చేతులతో తయారు చేసినవే. కారు లోపల మరియు బయట వేయడానికి సంస్థ దగ్గర 44,000 రంగులు అందుబాటులో ఉంటాయట. ఈ పెయింటింగ్ ను ఐదు పొరల్లో ఇరవై రెండు దశలుగా సుమారు 50 కిలోల పెయింటింగ్ తో వారం రోజుల పాటు చేస్తారట. ఈ ఒక్క పని మాత్రం రోబోలు చేస్తాయట. మిగతా అన్ని పనులు మనుషులు చేస్తారని, అది కూడా ఎలాంటి మిషన్లు వాడకుండా చేతుల ద్వారానే చేస్తారట.

అయితే ఈ కారు పై పెయింటింగ్ వేసే వ్యక్తి ఒక్కరే ఉన్నారట. ఆయన గత 18 సంవత్సరాలుగా రోల్స్ రాయిస్ కారుపై గీతలు వేయడానికి మూడు గంటల సమయం తీసుకొని పూర్తి చేస్తారట. ఆ రంగులు వేయడంలో ఆయన వాడే బ్రష్ లు కూడా ప్రత్యేకమైనవే. అందులో ఎద్దు, ఉడుత వెంట్రుకలతో తయారుచేస్తారు

కారు లోపల పైకప్పు నక్షత్ర మండలాన్ని పోయినట్టు ఉండడం. 1600 ఫైబర్ ఆప్టిక్ లైట్లు అమరుస్తారు. ఇది కూడా కళాకారులు చేతితోనే రెండు వారాల పాటు చేస్తారట. దీనికోసం దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉండే వైర్లను వాడతారు. అలాగే కారులో ఉండే సీట్లను ప్రత్యేకంగా పెంచిన ఎడ్ల చర్మం నుండి తీసి పదిహేను రోజులపాటు తయారుచేస్తారు.

అయితే ఈ కారులో ముఖ్యంగా ప్రత్యేకమైన చెట్టు నుంచి తీసుకున్న చెక్కను మాత్రమే వాడతారు. మరీ ముఖ్యంగా రోల్స్ రాయిస్ కార్ల టైర్ల పై ఉన్న లోగో టైర్ తిరుగుతున్నా కానీ నిలువుగానే కనపడుతూ ఉంటుంది. ఇది దీనికి ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా రోల్స్ రాయల్ కార్ లో అనేక ప్రత్యేకమైన వెసులు బాట్లు ఉండటం వలన దీని తయారీకి ఇంత సమయం పడుతుంది రేటు కూడా ఆ విధంగానే ఉంటుంది.

 

 


End of Article

You may also like