మీరెప్పుడైనా పాన్ కార్డు నెంబర్ ను గమనించారా..? కొన్ని లెటర్స్ తో పాటు సంఖ్యలు కూడా ఉంటాయి. ఒక్కోసారి సున్నానో… లేక “ఓ” అనే అక్షరమో కూడా తేల్చుకోవడం కష్టం గా అనిపిస్తుంది. కానీ.. అసలు ఈ సంఖ్యలు అయినా, అక్షరాలు అయినా ఎందుకు ఉంటాయో తెలిస్తే.. మీ పాన్ నెంబర్ ను మీరు గుర్తు పెట్టుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు. ఇంతకీ.. ఈ సంఖ్యలు, అక్షరాల వెనక అర్ధం ఏంటో తెలుసుకుందాం రండి.

pan card 1

పాన్ నెంబర్ కంప్యూటర్ మీద జెనరేట్ చేయబడింది కాదు. ఈ నెంబర్ లో ప్రతి అంకెకు, అక్షరానికి వెనక అర్ధం ఉంటుంది. మొదటి మూడు సంఖ్యలు AAA – ZZZ సిరీస్‌లో లో ఉంటాయి. ఆ తరువాత వచ్చే నాలుగో ప్లేస్ లో ఉండే అక్షరం వెనక అర్ధం ఈ విధం గా ఉంటుంది.
“P” – ఈ అక్షరం ఉంటె సదరు వ్యక్తి వ్యక్తిగత పన్ను చెల్లించేవారని అర్ధం.
“C” – ఈ అక్షరం ఉంటె కంపెనీ అని అర్ధం.
“H” – ఈ అక్షరం ఉంటే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కు చెందిన అవారని అర్ధం.
“A” – ఈ అక్షరం ఉంటే వ్యక్తులు లేదా సంస్థల బృందం(అసోసియేషన్ పర్సన్స్‌-ఏఓపి) అని అర్ధం వస్తుంది.
“B” – ఈ అక్షరం ఉంటే వ్యక్తుల బృందం(బిఓఐ) కు చెందినది అని అర్ధం.
“G” – ఈ అక్షరం ఉంటే ప్రభుత్వ ఏజెన్సీ కి చెందినది అని అర్ధం.
“J” – ఈ అక్షరం ఉంటే తాత్కాలిక న్యాయవ్యవస్థ కు చెందినది అని అర్ధం.
“L” – ఈ అక్షరం ఉంటే స్థానిక అధికారిక కేంద్రానికి చెందినది అని అర్ధం.
“F” – ఈ అక్షరం ఉంటే సంస్థ లేదా పరిమిత భాగస్వామ్య సంస్థ కు చెందినది అని అర్ధం.
“T” – ఈ అక్షరం ఉంటే ఏదైనా ట్రస్ట్‌ కు చెందిన వారు అని అర్ధం.

pan card 2

ఇక ఐదవ అక్షరానికి వచ్చేసరికి అది సదరు వ్యక్తి ఇంటిపేరులోని మొదటి అక్షరం ఉంటుంది. ఒకవేళ వ్యక్తులు కాకుండా ఇతరమైనవి ఐతే.. ఆ పాన్ కార్డు ఎవరికీ ఇస్తున్నారో.. ఆ హోల్డర్ పేరు లోని మొదటి అక్షరాన్ని ఐదవ స్థానం లో పెడతారు. ఆ తరువాత నాలుగు సంఖ్యలను పొందుపరుస్తారు. ఈ నాలుగు సంఖ్యలు 0001 నుంచి 9999 మధ్యలో ఏవైనా కావచ్చు. అలాగే చివరి స్థానం మాత్రం ఎప్పుడు అక్షరమే ఉంటుంది. ఇలా పది స్థానాలు ఎందుకు ఉంటాయో తెలిస్తే.. పాన్ నెంబర్ ను గుర్తు పెట్టుకోవడం తేలికే.