పెన్సిల్ పైన “బ్లాక్” గా ఎందుకు ఉంటుందో తెలుసా..!?

పెన్సిల్ పైన “బ్లాక్” గా ఎందుకు ఉంటుందో తెలుసా..!?

by Anudeep

Ads

ప్రతి ఒక్కరూ జీవితంలో పెన్సిల్ ఉపయోగించే ఉంటారు. మనం ఎలా రాయాలో నేర్చుకునే ప్రారంభ దశలో మొదట వాడేది పెన్సిల్ నే. తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉండడం వల్ల మొదట మనం పెన్సిల్ ని ఉపయోగిస్తాం. అయితే పెన్సిల్ ని అచ్చ తెలుగులో సీసలేఖిని అంటారు.

Video Advertisement

మనం పేపర్ మీద వ్రాసే పెన్సిల్ ని కార్బన్ రూపాంతరమైన గ్రాఫైట్ తో తయారుజేస్తారు. పెన్సిల్ నల్లని సీసంతో స్థూపంగా లేక సన్నని కర్ర పుల్ల లాగా పొడవుగా వుంటుంది. పెన్సిల్ తో రాసినవి రబ్బర్ తో తుడిచే అవకాశం ఉండడం వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా వాడుతుంటారు. ఏదైనా తప్పుగా రాస్తే ఈజీగా చేరిపేయ్యొచ్చని.

అయితే మీరు పెన్సిల్ మీద ఒక నల్ల టిప్ చూసే ఉంటారు. అన్ని పెన్సిల్స్ కి అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా..!? అలా ఉండడానికి ప్రత్యేకమైన కారణమంటూ ఏం లేదు, అది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మనం రెడ్ కలర్ చూసి అది నటరాజ్ పెన్సిల్ అని, సిల్వర్ కలర్ చూసి అది అప్సర అని చెప్పేస్తాం అలా ఒక్కో కంపనీ ఒక్కో కలర్ ని తన బ్రాండ్ గా మార్చుకుంటుంది.

అలాగే ఈ టిప్ దగ్గరి వరకు పెన్సిల్ ముళ్ళు వస్తే పిల్లలు ఇంకో పెన్సిల్ కొనుక్కుంటారు. అదే ఆ టిప్ చిన్నదిగా ఉంటే.. పెన్సిల్ పెద్దదిగా కనిపిస్తుంది. జస్ట్ అవి భ్రాంతి కోసం క్రియేట్ చేసినవే. వాటి వెనక ప్రత్యేకమైన కారణాలు ఏం లేవు. మన జీవిత ప్రారంభంలో పెన్సిల్ తో ప్రారంభించినా.. జీవితం ఎప్పుడూ పెన్ను లాంటిదే. పెన్నుతో రాసినవి ఎలా చెరిపేయలేమో జీవితంలో జరిగిపోయిన కొన్ని తప్పులను కూడా మనం సరిదిద్దలేము.

ఒకరకంగా పెన్సిల్.. జీవితంలో నేర్పే పాఠం లాంటిది అనుకోవచ్చు. నీ బాల్యంలో మాత్రమే పెన్సిల్ ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళే కొద్ది తప్పులు లేకుండా చూసికోవాలి కానీ రబ్బరు కోసం వెతుక్కోకూడదు అని పెన్సిల్ నుంచి ఓ జీవితపాఠాన్ని నేర్చుకోచ్చు.


End of Article

You may also like