మనం రోజు చూసే విషయాలను అవసరం లేదు అనుకుంటే అంత గా పట్టించుకోము. అది సాధారణం గానే మనిషి మెదడు లో అలా డిజైన్ చేయబడి ఉంది. అవసరమైన విషయాలను మాత్రం ఎక్కువ గా గుర్తుపెట్టుకోవడానికి మానవ మెదడు ప్రయత్నిస్తుంది. అయితే.. కొన్ని విషయాలు ముఖ్యమైనవే అయినా.. మనకు తెలియక పోవడం వలన మనం పట్టించుకోము.

google 1

మనకు ఏ విషయం తెలియకపోయినా గూగుల్ తల్లిని అడిగేయడం మనకి అలవాటే. ప్రతి చిన్న ప్రశ్నకి సమాధానం గూగుల్ లో దొరుకుతుంది. అయితే.. మనం రోజులో ఎన్ని సార్లు గూగుల్ ను ఓపెన్ చేసినా.. దాని కింద ఉండే ఈ బటన్ ని మాత్రం అంత గా పట్టించుకుని ఉండము. దానికి కారణం అది మనకి ఏమి అవసరం అని అనుకుంటూ ఉండడం వల్లనే.

google 2

గూగుల్ కింద రెండు ఆప్షన్స్ ఉంటాయి. అవి ఒకటి “గూగుల్ సెర్చ్”, మరొకటి “అయామ్ ఫీలింగ్ లక్కీ” అని రెండు బటన్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఏదైనా గూగుల్ బాక్స్ లో టైపు చేసి గూగుల్ సెర్చ్ ను క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వబడుతుంది. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అందుకు సంబంధించిన సమాచారమంతా గూగుల్ మనకి చూపిస్తుంది.

google 3

అయితే.. ఈ కింద చూపించే సైట్లలో మంచి స్టాండర్డ్ ఉన్న సైట్లను, మంచి ఇన్ఫర్మేషన్ ను ఇచ్చే వెబ్సైట్లను ఆర్డర్ లో చూపిస్తూ ఉంటుంది. వాటిల్లో మనకు నచ్చింది ఎంచుకుంటాం. అయితే.. మనకు కావాల్సిన సబ్జెక్టు ను సెర్చ్ బాక్స్ లో టైపు చేసాక, సెర్చ్ బటన్ ను కాకుండా.. “అయామ్ ఫీలింగ్ లక్కీ” అనే బటన్ ను టైపు చేస్తే వెంటనే ఏ సైట్ అయితే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ను ప్రొవైడ్ చేస్తుందో.. ఆ సైట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. మనం గూగుల్ చూపించే సైట్ లలో వెతకాల్సిన అవసరం ఉండదు. ఇలా యూజర్ల టైం ను సేవ్ చేయడం కోసమే.. గూగుల్ ఈ బటన్ ను తీసుకొచ్చింది. అమేజింగ్ కదా..