Ads
మీరెప్పుడైనా గమనించారా. కన్స్ట్రక్షన్ మెషీన్లు ఎప్పుడు పసుపు రంగులోనే ఉంటాయి. ఎక్కడైనా చూడండి. ఇవి పసుపు రంగులోనే ఉంటాయి. దీనికి కారణమేమిటంటే.. హెచ్చరిక సంకేతాలు తరచుగా పసుపు, పసుపు / నలుపు చారలు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. పసుపు చాలా ప్రకాశవంతమైన రంగు. దూరం నుంచి కూడా ఈ రంగుని సులభం గా గుర్తించవచ్చు.
Video Advertisement
పరిసరాలలో ఈ రంగు ఎక్కువ గా ఉండదు కాబట్టి చూడగానే, మనం పసుపు రంగుని గుర్తించగలుగుతాము. సాధారణం గా నిర్మాణాలు జరుగుతున్న చోట్ల మనుషులు ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఇలాంటి మెషీన్లు ఎక్కడ ఉన్న కనబడుతూ ఉండాలి. అందుకే వాటికి సులభం గా గుర్తించే పసుపు రంగు పెయింట్ ను వేస్తారు.
అయితే కచ్చితం గా ఓ రంగునే ఎంచుకోవడం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉండొచ్చు. ఇది మొదట గా నిర్మాణ యంత్రాల రంగు తరచుగా సంబంధిత సంస్థ లేదా పరికరాల తయారీదారుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీలు తమ యంత్రాలను పసుపు రంగుగా కాకుండా మరికొన్ని ఎరుపు రంగులో గుర్తించే చిహ్నంగా పెయింటింగ్ చేస్తున్నాయి. అయితే, కొన్ని సార్లు చట్టప్రకారం కూడా నిబంధనలను అమలు చేయాల్సి రావచ్చు.
End of Article