కోపం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయనే విషయం తెలిసిందే. కోపం వచ్చిన సమయంలో మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్ని  కానీ, ఎవరితో మాట్లాడుతున్నామనే విషయాన్ని కానీ కొంచెం కూడా ఆలోచించలేరు. దాని వల్ల మనుషుల మధ్య ఉండే సంబంధం తెగిపోతుంది.

Video Advertisement

ఇక కోపం వచ్చిన సమయంలో నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయో కూడా వారు అర్ధం చేసుకోలేరు. ఆ సమయంలో ఎదుటి వారు ఎవరైనా వారిని తిట్టడం, శాపనార్ధాలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే పిల్లల పై కోపం వచ్చినపుడు తల్లితండ్రులు పెట్టె శాపనార్ధాలు ప్రభావం వారి పై పడుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..
భక్తి టీవీలో ప్రసారం అవుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమంలో  తల్లితండ్రులు పెట్టిన శాపనార్ధాల ఫలిస్తాయా అని ఒకరు అడిగిన సందేహానికి డాక్టర్ శ్రీ మైలవరపు శ్రీనివాసరావుగారు ఇలా సమాధానం చెప్పుకొచ్చారు. “జ్ఞానంతో తిట్టినా, అజ్ఞానంతో తిట్టినప్పటికి ఆ వాక్కు ఫలిస్తుంది. అందువల్లనే పాతకాలంలో అమ్మమ్మలు, బామ్మలు వంటివారి నోటి నుండి ఒక్కమాట కూడా అపశబ్ధం వచ్చేది కాదు.
కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఏం చేస్తున్నామో తెలియదు. ఎవరిని తిడుతున్నామో కూడా తెలియదు. ఎవరిని శపించే స్థాయికి వాక్కు వెళ్తుందో మనసుకు, బుద్ధికి తెలియదు. సాధారణంగా తల్లి దండ్రులు పిల్లల ప్రవర్తన పై కోపం వచ్చినపుడు తిడుతూ, శాపనార్ధాలు పెడుతుంటారు. అయితే ఏ తల్లి దండ్రులు కూడా తమ పిలల్లని మనస్పూర్తిగా దూషించరు, శపించరు. కోపంలో పిల్లలను, తిట్టడం, శపించడం అనేది జరుగుతుంటుంది. అవి మనస్పూర్తిగా వచ్చినవి కానప్పటికీ, ఆ తిట్లు, శాపనార్ధాలు ఫలిస్తాయని చెప్పుకొచ్చారు.
వాస్తవంగా పిల్లలు తప్పు చేసినపుడు ఎప్పుడు కూడా మందలించాలి. కోపంతో కళ్ళతో మందలించాలి. అవసరం అయితే చిన్నపాటి దెబ్బ వేసి మందలించాలి. అది తప్పు కాదు కానీ, నోటితో మాత్రం పిల్లలను ఏమి అనకూడదు. ఎంత కోపం వున్నప్పటికీ, నోటితో మాత్రం తిట్టడం, శపించడం లాంటివి చేయకూడదు. వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితం అయ్యి బయటికి వస్తుంది. కాబట్టి ఫలించే అవకాశం ఉంటుంది”. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి..

watch video :

Also Read: పిల్లలు ఎట్టి పరిస్థితిలో ఫోన్ ముట్టుకోకుండా ఉండడానికి అద్భుతమైన టెక్నిక్..! ఏమిటో తెలుసుకోండి..!