చాలా మంది బరువు తగ్గుడం అనుకోగానే మొదట చేసే పని పొద్దున్నే నిమ్మకాయ నీటిని తాగడం. వేడి నీటిలో నిమ్మకాయ పిండుకుని.. అందులో కొంచం తేనే వేసుకుని తాగేస్తూ ఉంటారు. దీనివలన నిజం గానే బరువు తగ్గుతారా..? అంటే నిమ్మకాయ బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది తప్ప పూర్తి గా బరువు తగ్గించదు.

lemon water

అంటే.. మీరు శారీరకం గా చెమటలు చిందిస్తూ.. ఉదయాన్నే నిమ్మకాయ నీటిని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. నిమ్మకాయ లోని విటమిన్ సి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ నీటిని తీసుకోవడం తో పాటు గా యోగా, నడక, జాగింగ్, జిమ్ వంటివి చేస్తూ ఉంటె.. బరువు తగ్గడం తేలిక అవుతుంది. అలాగే నిమ్మ నీటిలో ఉండే పెక్టిన్ అనే పదార్ధం ఎక్కువ గా ఆకలి వెయ్యనివ్వదు. ఫలితం గా తినే తిండి పై కూడా కంట్రోల్ ఉంచుతుంది.