Ads
చాలా మందికి ఎదురవుతున్న సమస్య గ్రే హెయిర్. ప్రస్తుతం చాలా మంది యువతలో కూడా కనిపించేస్తోంది. చాలా కాలం వరకు మనుషుల్లో ఈ ఇబ్బంది లేదు. కనీసం 40 ఏళ్ళు దాటాకే తెల్ల జుట్టు వచ్చేది. కానీ.. ప్రస్తుతం చాలా మందికి చిన్న వయసులోనే ఈ సమస్య ఎదురవుతోంది.
Video Advertisement
కొంతమందికి టీనేజీ వయసు కూడా దాటకుండానే వచ్చేస్తోంది. బాల నెరుపు అని పేర్కొంటూ ఉంటారు దీనినే. మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం, విపరీతమైన ఒత్తిడిలు కూడా ఒక కారణం.
సరైన పోషకాహారం తీసుకోకపోతే శరీరం లో మెలనిన్ ఉత్పత్తి కాదు. ఫలితంగా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. నల్లగా ఉండే కురుల్లో మెలనిన్ ఎక్కువగా ఉందని అర్ధం. బ్రౌన్ కలర్ లో ఉంటె తక్కువ మెలనిన్ ఉందని అర్ధం. ఇక తెల్లగా అయ్యింది అంటే.. మెలనిన్ ఉత్పత్తి కావడం లేదని అర్ధం. తీవ్రంగా ఒత్తిడికి గురి అవుతున్నప్పుడు కూడా మెలనిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. అటువంటి పరిస్థితుల్లోనే తలపై అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొందరు వీటిని చూడగానే నామోషీ అయ్యి పీకేస్తూ ఉంటారు.
వీటిని పీకితే అలాంటివి ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తాయని అందరు చెబుతూ ఉంటారు. అయితే.. ఇది కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకే చోట గుంపు గుంపుగా తెల్లని వెంట్రుకలు రావడం వలన ఇలాంటి అపోహ ఏర్పడిందని చెబుతారు. తెల్ల వెంట్రుకలు ఎక్కువగా రావడానికి కారణం మెలనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడమే. అందుకే సరైన పోషకాహారం తీసుకోవడం, జుట్టు పట్ల శ్రద్ధ వహించడం ద్వారా ఈ సమస్యని అధిగమించాలట. అయితే.. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్నా.. జుట్టు పరంగా ఏ ఇతర సమస్యలు ఎదురవుతున్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
End of Article