Ads
చాలా మందిలో కరోనా వచ్చి వెళ్లిన తరువాత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. వారు పూర్తి స్థాయిలో మునుపు ఉన్నంత గా ఆరోగ్యం గా, ఉత్సాహవంతం గా పని చేయలేకపోతున్నారు. కొంతమంది వ్యక్తులైతే కరోనా నుంచి కోలుకుని ఏడాది గడుస్తున్నా.. వారి పరిస్థితి ఇబ్బందికరం గా ఉంటోందని తేలింది. కరోనా వచ్చి వెళ్లిన తరువాత చాలా మంది రోగులలో జుట్టు రాలడం కూడా ప్రధాన సమస్య గా కనిపిస్తోంది.
Video Advertisement
కరోనా కారణం గా తీవ్ర ఒత్తిడి కి గురి అయ్యి.. తిరిగి సాధారణ స్థితి కి చేరుకోవడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లో జుట్టు రాలడం కూడా ఒకటి. ఒత్తిడి కి గురి అవ్వడం వలనే జుట్టు రాలుతూ ఉంటుంది. తలలో ఇన్ఫెక్షన్ ఏర్పడడం, మంట గా అనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. శరీరం లో విటమిన్ బి 12 మరియు విటమిన్ డి స్థాయి తగ్గడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. కాబట్టి కరోనా తగ్గిన తరువాత కూడా తగినంత పోషకాహారం తీసుకుని, జుట్టుని కాపాడుకోవడం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
End of Article