ఉదయం పూట వీటిని అల్పాహారంగా తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది

ఉదయం పూట వీటిని అల్పాహారంగా తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది

by kavitha

Ads

రోజు క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది. అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అందులోనూ పోషక విలువలు కలిగిన అల్పాహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

Video Advertisement

అలా అని అల్పాహారంగా ఎదో ఒకటి తినకుండా ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. లేదంటే అవి చాలా దుష్ప్రభావాలను చూపిస్తాయి. అందువల్ల అల్పాహారంగా ఏం తినాలో మాత్రమే కాకుండా ఏమేం తినకూడదో కూడా తెలుసుకోవాలి. అయితే ఉదయం పూట ఏం తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.. Unhealthy-Breakfastవైట్ బ్రెడ్:
ఆఫీసుకు వెళ్లే తొందరలో కొందరు వైట్ బ్రెడ్ ను టీతో కానీ, జామ్, బటర్ వంటి వాటితో తిని వెళ్తుంటారు. వైట్ బ్రెడ్ లో పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తినడడం వల్ల జీర్ణక్రియ పై చెడు ప్రభావం ఉంటుంది. అందువల్ల బ్రేక్ ఫాస్ట్ లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవచ్చు.
white-breadప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్:
చాలామంది పొద్దున పూట పండ్లు కానీ, వాటి జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచింది అని భావిస్తారు. ఆ క్రమంలో కొందరు ప్యాక్‌డ్‌ పండ్ల రసాలను తీసుకుంటారు. అవి తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ లలో షుగర్, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి.
flavored-yogurtఫ్లేవర్డ్ యోగర్ట్:
ఇటీవల కాలంలో అల్పాహారంలో పెరుగుకు బదులు ఫ్లేవర్డ్ యోగర్ట్ తినడం ట్రెండ్ గా మారింది. అయితే ఇందులో  షుగర్ పదార్ధం అధికంగా ఉండటం వల్ల రక్తం లో షుగర్ స్థాయిలను పెంచుతుంది. అందువల్ల పొద్దున్నే తీసుకోకండి.
flavored-yogurtకాఫీ:
ఉదయం నిద్రలేవగానే చాలా మందికి కాఫీ తాగడం అలవాటు. కాఫీ తాగగానే రిఫ్రెష్‌గా ఫిల్ అవుతుంటారు. అయితే కాఫీ ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. పొద్దునే ఖాళీ పొట్టతో కాఫీ తాగడం ద్వారా జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఖాళీ కడుపుతో కాఫీని తీసుకోకూడదు.
coffeeతృణధాన్యాలు:
గత కొన్నేళ్లుగా అల్పాహారంలో  తృణధాన్యాలతో చేసిన వాటిని తినే ధోరణి ఎక్కువగా పెరిగింది. కానీ ప్రాసెస్ చేసినవి హెల్త్ కి మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ధాన్యాలు తక్కువ, షుగర్ అధికంగా ఉంటుంది. దాంతో ఊబకాయం,  మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
milletsAlso Read: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదంట.. అవి ఏమిటంటే..

 


End of Article

You may also like