అన్నం తిన్నాక ఈ 5 తప్పులని పొరపాటున కూడా చేయద్దు.. చేస్తే దరిద్రం మీ వెంటే…!

అన్నం తిన్నాక ఈ 5 తప్పులని పొరపాటున కూడా చేయద్దు.. చేస్తే దరిద్రం మీ వెంటే…!

by Anudeep

Ads

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు అంటుంటారు. చాలా మంది తినడానికి తిండి లేక అవస్థలు పడుతూ ఉంటారు. అందుకే అన్నం తినడానికి దొరికిన వారు అదృష్టవంతులు. తినే ఆహార పదార్ధాలను వృధా చేయరాదని చెబుతూ ఉంటారు. మన పళ్లెం లోకి అన్నం రావడం వెనుక రైతుల కష్టం చాలానే ఉంది.

Video Advertisement

అందుకే అన్నం ముందు కూర్చుని తిట్టుకోవడం లాంటివి చేయకుండా.. అన్నాన్ని గౌరవించి మౌనంగా భోజనం పూర్తి చేయాలి. పళ్లెం లో పెట్టుకున్న తరువాత ఆ అన్నాన్ని తినలేక పారవేయకూడదు.

rice 2

అన్నం తిన్న తరువాత ఈ 5 తప్పులను అస్సలు చేయకూడదట. ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.
# అన్నం తినేటప్పుడు మీ ప్లేట్ చుట్టూ మెతుకులు పోయకుండా తినడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున పడినా వాటిని తీసేయాలి. అన్నం మెతుకులు ఎవరూ తొక్కకూడదు.

#అలాగే అన్నం తినేటప్పుడు గట్టిగా అరుస్తూ, నవ్వుతు మాట్లాడకూడదు. మౌనంగా భోజనాన్ని ముగించాలి. భోజనం చేయడం పూర్తి అయ్యాక తిన్న పళ్లెం లోనే చేతులు కడగకూడదు.

# అలాగే తిన్న పళ్లెం ఎండిపోయేదాకా పడేయకూడదు. ఆ పళ్ళేన్ని వెంటనే కడిగివేయాలి. తిన్న పళ్లెం లోనే చేతులు కడిగినా.. ఆ పళ్లెం ఎండిపోయినా దారిద్య్రాన్ని తెచ్చిపెడుతుందని విశ్వసిస్తుంటారు.

#అలాగే అన్నం తినే మధ్యలో దగ్గు లేదా, తుమ్ము వచ్చినప్పుడు, పొలమారినప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్లి ఉమ్మేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కుని వచ్చి భోజనం చేయాలి.

rice 1

# కూర్చునే భోజనం చేయాలి. నిలబడి చేయడం మంచిది కాదు. అలాగే తిన్న తరువాత బద్ధకంగా ఎంగిలి పళ్లెం పక్కనే చాలా మంది పడుకుంటూ ఉంటారు. ఇది దారిద్య్రాన్ని తెచ్చి పెడుతుంది. తిన్న పళ్లెం పక్కనే ఎప్పుడూ పడుకోకూడదు. చేతులు కడుక్కుని తిన్న ప్లేస్ ను శుభ్రం చేసిన తరువాతే పడుకోవాలి.


End of Article

You may also like