ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య అధికంగా జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని మంచి ఆయిల్స్ ని వాడినా జుట్టు రాలిపోతోంది అంటూ చాలా మంది తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా తలస్నానం చేస్తే చాలు.. ఈ జుట్టు మరింతగా రాలిపోతూ ఉంటుంది.

Video Advertisement

జుట్టు తడిగా ఉన్నపుడు దువ్వినా సరే చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. మరి ఏమి చేయాలి..? ముఖ్యంగా జుట్టు తడిగా ఉన్న సమయాలలో ఈ ఐదు పొరపాట్లను అస్సలు చేయకండి.

wet hair

తడిగా ఉన్న సమయంలో జుట్టు కుదుళ్ళు బలహీనంగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో పొరపాటున కూడా జుట్టుని దువ్వకండి. తడిగా ఉన్న జుట్టుని ఆరబెట్టడం కోసం హెయిర్ డ్రైయర్స్ ని వాడకండి. ఇంకా హెయిర్ కర్లర్స్, హెయిర్ స్ట్రెయిట్నర్స్ వంటి వాటిని కూడా వాడొద్దు. తడి జుట్టుతో ఎప్పుడూ నిద్రపోవద్దు. పొరపాటున కూడా టవల్ తో పదే పదే రుద్దకండి. జుట్టు తడిగా ఉన్నపుడు ముడి వేయడం వలన కూడా జుట్టు పాడవుతుంది. అలాగే.. రకరకాల హెయిర్ స్ప్రే లతో జుట్టు పై ప్రయోగాలు చేయకండి.